ఇస్లాం పై అపోహలు

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ 
ముస్లిమేతరుల కొన్ని ప్రశ్నలకు జవాబులు
1. ఇస్లాం పురుషులకు నలుగురు స్త్రీలను వివాహం చేసుకునే హక్కు కల్పించడం, ఇది పురుష ఆధిపత్యానికి ఒక నిదర్శనం కాదా. ???
 ఇస్లాం ను విమర్శించే ముందు ఒకే భార్య ఉండాలన్న నిబంధన ఉన్న ఏదైనా ఒక దార్మిక గ్రంధం చూపించండి. భారతదేశ పురాణాల కథలు చూసినచో (ఉదా:-- వేదాలు, రామాయణం, మహాభారతం, తాల్ముద్, గీతలలో) ఒక భార్య కంటే ఎక్కువమంది భార్యలు ఉన్నవారి సంఖ్యే ఎక్కువ కనిపిస్తుంది. ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలు ఉండటం తప్పు అని ఎక్కడా  ఉండదు. ( ఉదా :-దశరథ రాజు రాముని యొక్క తండ్రికి ఒకరికన్న ఎక్కువ భార్యలు, కృష్ణునికి లెక్కలేనన్ని భార్యలు. బైబిల్ లో చూసినట్లయితే అబ్రహామునకు  ముగ్గురు భార్యలు,  సోలోమానుకు వందల మంది భార్యలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.  
   1954  సం\'' లో ఓ హిందూ చట్టాన్ని తెచ్చారు, ఒక భార్య ఉండగా మరో స్త్రీని వివాహమాడరాదని, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే 1400 సం'' లకు పూర్వమే ఒకే భార్య కలిగి ఉండటమే మేలు అని వివరించింది ఇస్లాం. అంతేకాదు ఒకరికంటే ఎక్కువ మందిని వివాహమాడితే వారికి (భార్యలకు) సరియైన న్యాయం చేయండి అని, అదే విషయాన్ని దివ్యఖుర్ఆన్  లోచూడండి. 

      అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే, మీకు నచ్చిన (ఇతర) స్త్రీలను ఇద్దరిని గానీ, ముగ్గురిని గానీ, నలుగురిని గానీ వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించ లేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే  చేసుకోండి.                                     దివ్యఖుర్ఆన్ (4:3)

    
 ఇదే సూరాలో మరొక చోట ఇలా ఉంది  మరియు మీరు ఎంతకోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయ మాన స్థితిలో వదలకండి.                                                                                               దివ్యఖుర్ఆన్ (4:129)
                                                              

  పై రెండు
ఖుర్ ఆన్ వచనములను బట్టి తెలిస్తున్నది ఏమిటంటే భార్యలకు సరైన న్యాయం చేయగలిగినప్పుడే ఒకరికంటే ఎక్కువ మంది అంటే నలుగురు  వరకు వరకు వివాహం చేసుకునే హక్కు ఉంది. లేకుంటే లేనట్లే కదా. ఒక భార్య కలిగి ఉండటమే మేలు అన్నది కూడా తెలుస్తుంది.

ఇస్లాంను నిందించే ముందు ఇస్లామ్కు పూర్వం పరిస్థితి ఎలా ఉండేదో ఒక్క సరి చుడండి. అరబ్బులలో అయితే ఓ పురుషుడు ఎంత మంది నైన వివాహం చేసుకునే హక్కు ఉండేది.  కొత్త భార్య వస్తే పాత భార్యను నిర్లక్షం చేసేవాడు, లేదా ఆమెనూ విడిచిపెట్టేవాడు. పురుషుడు ఎన్ని బాధలు పెట్టిన అతని వద్దనే పడి ఉండ వలసిందే. ఆమె బాధను చెప్పుకునే అవకాసం కూడా ఉండేది కాదు. అలానే స్త్రీని తన ధన బలంతో, భుజబలంతో వసపరచుకునే వాడు ఇటువంటి దురక్రుత్యలనుఆపేందుకు ఇస్లాం ఇటువంటి ఎన్నో నియమాలు విధించింది. వివాహం చేయించేటప్పుడు ఖాజీ అంటే (వివాహం జరిపించే పద్దతి) పెళ్లి కుమార్తె కు ఈ పెళ్లి నీకు సమ్మతమేనా? లేదా? అని ముందు అడుగుతాడు. ఆమెకు సమ్మతమైతేనే వివాహం జరిపిస్తాడు. లేదంటే ఆయన వివాహం జరిపిoచడు. అలానే వివాహం జరిగిన తర్వాత ఆమెను భర్త వేదిస్తున్నా,  లేక ఇతర కరాణాల వల్ల ఆమె అతని నుండి విదిచిపోవచ్చు. దీనినీ (ఖుల) అంటారు.  
            ఇస్లాం స్త్రీ లకు ఎన్నో హక్కులను కల్పించి వారి ఆత్మాగౌరవాన్ని పెంచింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.  
                 ఖుర్ఆన్ లోగల నియమ నిబంధనలు పాటించుటవలన ఎన్నో ప్రయోజనాలు శాస్త్రియపరంగా కూడా కనిపిస్తాయి. ఒక పురుషునకు నలుగురు స్త్రీలు వరకు వివాహమాడే అర్హత కల్గింది. అంటే అందులో పరమార్ధం ఉంటుంది. 
                అదేమిటో కొన్నింటిని మీ ముందు ఉంచుతాను చూడండి. వైద్య శాస్త్రం ప్రకారం పురుషుల కంటే మహిళల ఆయుష్యు ఎక్కువ అని కొన్ని సర్వేల వల్ల తెలుస్తుంది. మగ శిశువు కంటే ఆడ శిశువుకే వ్యాది నిరోధిక శక్తి అధికంగా ఉంటుంది. ఆడ శిశువులకన్నా మగ శిశువులే ఎక్కువగా చనిపోతూ ఉంటారు. పెధవాల్లలో కూడా పురుషులే అధికంగా చనిపోతారు. యాక్సిడెంట్ ల వలన, యుద్ధాల వలన స్థ్రీలకన్న పురుషులే ఎక్కువగా చనిపోతూ ఉంటారు. మన భారతదేశంలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా చనిపోతు ఉంటారు.  ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు స్కానింగ్ ద్వారా కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా అని తెలుసుకొని ఆడబిడ్డ అయితే  గర్భలో చంపేస్తున్నారు. ఇది ఎంత నిక్రుష్టమో ఆలోచించండి. 
     అమెరికాలో  అయితే పురుషుల కంటే స్త్రీలు 7.8 మిలియన్ల మంది అధికంగా ఉన్నారు. కేవలం న్యూ యార్క్ పట్టణంలో 1 మిలియన్ మంది స్త్రీలు పురుషులకంటే ఎక్కువమంది ఉన్నారని తెలుస్తుంది. ఇక అమెరికాలో ఉన్న పురుషులతో 1/3 వంతు స్వలింగాసంపర్కులు ఉన్నారు. మొత్తం అమెరికాలో 2. మిలియన్ల మంది స్వలింగ సంపర్కులు ఉన్నారు. వీరు ఎలాను వివాహబంధానికి దూరంగా ఉంటారు. 
           బ్రిటన్ లో అయితే పురుషుల కంటే స్త్రీలు 4 మిలియన్ల మంది అధికంగా ఉన్నారు. జర్మనీ లో 5 మిలియన్ లు , రష్యాలో 9 మిలియన్లు ప్రపంచం మొత్తం మీద ఎంత మంది స్త్రీలు ఉన్నారో అల్లాహ్ కే తెలియాలి. 
      ఇలా ప్రపంచంలో ఎక్కడ చూసిన  స్త్రీల సంక్య ఎక్కువ. ఒక పురుషుడు ఒక్క  స్త్రీ నే వివాహమడాలనే నిబంధన కచ్చితంగా అమలు చేస్తే మిగిలిన  స్త్రీల సంగతి ఏమిటి? వివాహబంధం లేకుండా ఉండిపోవాలా? మరి ప్రకృతి సిద్ధమైన శారీరక వాంచలు తీరేది ఎలా? వారికి పిల్లలు, సంసారo , కుటుంభo వంటివి ఎలా ఎర్పడుతాయి? మరి వారి వాంఛలు అక్రమ సంబంధాల ద్వార తీర్చుకోవాలా ? ఒక పురుషునకు రొండో భార్య ఉండడం గౌరవంగ ఉంటుందా లేక స్త్రీకి,  స్త్రీయే చుసుకోవడమా? బజారుపాలు కావడమా? ముస్లింలు చట్టపరoగా ఇద్దరినీ వివాహం చేసుకుంటే తప్పు అని అరచిగీపెట్టిన వారు ఈ సమాజం లో పెద్ద మనషులుగా చలామణి అయ్యేవారిలో ఎంతోమంది అక్రమ సంభందం పెట్టుకొని సెంచరీలు కొట్టేవారు లేరా ? చట్ట వ్యతిరేకంగా ఇద్దరేసి ముగ్గురేసి భార్యలు కల్గి ఉండటం మనం చూడటం లేదా? 1951 నుండి 1961 సం॥లో కమిటి వారు హింధూ వివాహాలు, ముస్లిం వివాహాలు రెండో పెళ్లిళ్ళపై సర్వే చేసారు. ఆ కమిటి వ్రాసిన సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే ఇద్దరు భార్యలు ఉన్న వారు ముస్లిమేతరులు 5.06% ఉంటే, ముస్లింలు 4.31% మంది ఉన్నట్లు వెల్లడించారు. 
               ఇద్దరు భార్యలు కల్గినవాడు ఉత్తమమైన ముస్లిం అని ఎక్కడ ఉండదు. ముస్లిం సమాజం అతనికి ఎదో గొప్ప పని చేసినట్లు పరిగనoణిచదు.  ఇస్లాం ఒక స్త్రీ నుండి నలుగురు స్త్రీల వరకు వివాహం చేసుకునే హక్కు కల్పించినా, కొన్ని నియమాలు పెట్టింది. ఆ నియమాలు పాటించే శక్తి ఉన్నవాడే బహు భార్యలు కల్గి ఉండేందుకు అర్హుడు. అవి ఏమిటో మీరు ఖుర్ఆన్ వచనములలో చూసారు. భార్యల మధ్య న్యాయం చెయ్యడం మీకు కష్టం అని కూడా చెప్పబడింది. 
2. ఇస్లాం పురుషునకు ఒక భార్య కల్గి ఉండగా మరోక స్త్రీని , ఇద్దరిని గాని ముగ్గురిని గాని, నల్గురి వరకు వివాహమాడే హక్కు కల్పించింది. మరి అదే హక్కు స్త్రీలకు ఎందుకు కల్పించలేదు. 
ఇస్లాంలో కొన్ని చోట్ల స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత  ఇస్తే, కొన్ని చోట్ల పురుషునికి ఇవ్వబడింది. తండ్రి స్థానం గొప్పదా ? అంటే తల్లి స్థానం 75% గొప్పది. తండ్రి స్థానం 25% మాత్రమే. దేవుడు స్త్రీ పురుషుల శరీరాలను వేర్వేరు  ఆకారాలుగాను, వేర్వేరు స్వభావాలు కల్గి ఉన్నట్లు  సృష్టించాడు. స్త్రీ శరీరం కొమలంగాను నాజుకుగా ఉంటుంది . స్త్రీకి  బిడ్డను కనే  అద్రుష్టం, వారి రొమ్ములలో పిల్లవాడు పుట్టిన తరువాత పుష్టికరమైన  పోషక  పదార్ధాలను  కల్గిన పాలను సమకూర్చాడు. పురుషుని శరీరం దృడంగా, బలంగా ఉండేలా చేసాడు. అతడు కష్టపడి తన వాళ్ళను పోషించుకోగాల్గుతున్నాడు. స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలంటే మొదటి పిల్లవాడ్ని నేను కన్నాను, కాబట్టి రెండో పిల్లవాడ్ని నీవు నవమాసాలు మోసి కను అంటే వీలు అవుతుందా? లేదా మొదటివాడికి నేను పాలు పెట్టను రెండవ వాడికి నీవు పాలు పెట్టు అంటే వీలు ఉంటుందా? అల్లానే పురుషునకు ఒక భార్య కల్గి ఉండగా మరో భార్యతో కూడా కాపురం చెయ్యవచ్చు. అదే స్త్రీకి అయితే భర్త ఉండగా మరో భర్తతో కాపురం చేస్తే వివిధ సమస్యలు వస్థాయి . అవి ఏమిటంటే : 
                         ఒక వ్యక్తికి (పురుషునకు) నలుగురు భార్యలు ఉన్నవారికి కల్గిన సంతానానికి తల్లి ఏవరో గుర్తించడం సులువు. అదే స్త్రీకి నలుగురు పురుషులను పెండ్లడితే ఆమెకు పుట్టిన బిడ్డకు తండ్రి ఏవరో చెప్పడం అసంభవం. తాద్రి ఏవరో తెలియని పిల్లల మానసికి పరిస్థితి అంత బాగుండదని మానసిక వైద్యులు  చెబుతుంటారు .
అందుకనే వేశ్యలకు  పుట్టిన పిల్లలు అనారోగ్యంగా వుంటారు . అంతేకాదు ఆమె తన నలుగురు భర్తలకు సరైన న్యాయం చెయ్యలేదు. పైగా శారీరిక రుగ్మతలు సుడ వచ్చే అవకాశాలు అఎకువ. కాబట్టి స్త్రీకి ఒక భర్త ఉండటమే సముచితం. భర్త చనిపోయిన లేక భర్త విడాకులు ఇచ్చిన   కొంతగడువు  ముగిసిన తరువాత మరో వివాహం (పునర్వివాహం) చేసుకునే హక్కు కల్పించింది కేవలo  ఇస్లాo మత్రమే. 
                         మరియు మీలో ఎవరైనా మరణించి, భార్యలను వదలిపోయినట్లైతే (అలాంటి విధవలు) నాలుగు నెలల పది రోజులు (రెండవ పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. వారి గడువు పూర్తి అయిన తరువాత వారు తమకు ఉచితమైనది, ధర్మసమ్మతంగా చేసుకుంటే మీపై దోషంలేదు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును. 
                                                                                         (ఖుర్ఆన్  2వ సూర బఖర 234వ వాక్యం )
                        1400 సం॥  పూర్వమే ఇస్లాం స్త్ర్కి స్వేచ్చ ఇచ్చిన్ది. మరే మాతలో ఇలాంటి స్వేచ్చ ఇవ్వబదలెధు. మన భారత చరిత్రలో చూస్తే సతీసహగమనం ఉండేది . ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో (బీహార్ , ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్, ఒర్రిస్సాలలో) కొన్ని చోట్ల ఉన్ది. తన భర్త చనిపోతే మరొక పెళ్లి చేసుకునే హక్కులేదా?

        3.  ఇస్లాం స్త్రీలను పరదా వెనుకను నెట్టివారి స్వేచ్ఛన  స్వాతంత్ర్యాలు  లేకుండా చేసిందా ?

ఇస్లాం స్త్రీలకు స్వేచ్ఛ  లేకుండా చేసింది  అన్నది  నిరాధారమైన ఆరోపణ మత్రమే . ఇస్లాంకు  పూర్వం గురించి తెలియని వారు అన్నమాటలు  మాత్రమే . స్త్రీలకు పరదా ఏంతో అవసరo . పరదా వేసుకోవటంలో ముఖ్య  ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ముందు ఇస్లాలంకు  ముందు ప్రపంచంలో వివిధ దేశాలలో స్త్రీల పరిస్థితి గురించి తెలుసుకుందాం . 
                  బావిలోనియ శిక్షస్మ్రుతులలో పురుషుడు ఎవరినైనా హత్ర్య చేస్తే అతని భార్యకు మరణ శిక్ష విధిన్చేవారు. గ్రీకులు అయితే స్త్రీని అంగడిలో బొమ్మల పురుషుల వాంచలు తీర్చే వస్తువుల చూసే వారు. కనీసం మనిషి ల కూడా చూసే వారు కాదు. రోమ్ చరిత్ర చుస్తే స్త్రీలను నగ్నంగా చేసి ఆమె అందాలను అంగటిలో పెట్టేవారు. ఈజిప్ట్ లు అయితే స్త్రీలను అపశకునంగా భావించేవారు. అన్ని అనార్ధలకు మూలం స్త్రీయే అంటారు. అరబ్బులు అయితే ఆడ శిశువు పుడుతే అవమానముగా భావించేవారు. ఆడ పిల్లలను బతికి ఉండగానే పాతిపెట్టేవారు. ఇక భారతదేశానికి వస్తే భర్త శవంతో పాటు భార్యను కూడా తగలపెట్టేవారు. లేదా భర్త చనిపోతే భార్యను గుండు గీయించి తెల్ల చీర కట్టించేవారు. సమాజం లో వారికి ఎలాంటి విలువ ఉండేది కాదు. వారిని ఇప్పటికి అపశకునంగా భావిస్తున్నారు. ఇలాంటి స్త్రీలు ఎదురు రాకూడదని భావిస్తున్నారు. ఇస్లాం ఇలాంటి పరిస్థితిలలో స్త్రీలకు గౌరవాన్ని ఇచ్చింది. ఎవరికైనా ఆడపిల్ల పుడితే ఆమెకు మంచి విధ్యాబుద్దులు నేర్పి, వివాహం చేస్తే అలాంటి తండ్రి స్వర్గంలో స్థానం పొందుతాడు అని చెప్పింది ఇస్లాం. వివాహ సమయం ఖాజీ (పెళ్లిచేయిoచే వాడు) పెల్లికుమార్తే పెళ్లి ఆమె సమ్మతం తీసుకున్న తర్వాతే పెళ్లి చేస్తాడు. ఒక వేల భర్త చనిపోతే కొంత గడువు తర్వాత ఆమె మరో  వివాహం చేసుకునే అవకాశం కుడా కలిపించింది ఇస్లాం మాత్రమె. భర్త ఆమెను సరిగ్గా చూడని పక్షం లో అతనితో విడాకులు కోరే హక్కు ను ఇచ్చింది. మరి ఇస్లాం స్త్రీలకు స్వేచ్చలేకుండా చేసింది అనడంలో అర్ధం లేదు. 
                 అసలు పరదా ఎందుకు విదించింది? దాని  ముఖ్య  ఉద్దేశం ఏమిటి? వాటి విషయాలను ఖుర్ఆన్ ద్వార తెలుసుకుందాం. ఖుర్ఆన్ స్త్రీ కన్నా ముందు పురుషులకు ఈ హెచ్చరిక చేసింది. 
                 ప్రవక్తా! విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్‌ వారి చేష్టలను బాగా ఎరుగును. 
(ఖుర్ఆన్  24వ సూర అన్ నూర్ 30వ వాక్యం )
తర్వాత మహిళలను ఉద్దేశిoచి ఇలా చెప్పబడుతుంది. 
(ఓ ప్రవకా!) మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడు కోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు – (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని, తమ తలమీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమసోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ(తోటి)స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛ లేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప, ఇతరుల ముందు ప్రదర్శించ కూడదని మరియు కనబడ కుండా ఉన్న తమఅలంకారం తెలియబడేటట్లుగా, వారు తమ పాదాలను నేలపైకొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్‌ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు!
 (ఖుర్ఆన్  24వ సూర అన్ నూర్ 31వ వాక్యం ) 
పరదా చేయడం వలన స్త్రీల గురవం పెరుగుతుంది అని ఖుర్ఆన్ వివరిస్తుంది. 
 ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడ కుండా ఉండటానికి ఎంతో సముచితమైనది. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
 (ఖుర్ఆన్  33వ సూర అల్ అహ్'జాబ్ 31వ వాక్యం )
         ఇస్లాం చెప్పేది ఏమిటంటే చెడు చేయరాదు, చెడును ప్రేరేపించరాదు అని బోదిస్తుంది. స్త్రీ లకే కాదు పురుషులకు కూడా హద్దులు విదించింది. నాభి నుండి ముడుకుల వరకు అందరి ముందు ప్రధర్శించరాదు. పురుషులు అండర్వేర్లతో  తిరగరాదు.లోపలిబాగం కనిపించే విధంగా వస్త్రాలు ధరించరాదు. అంతేకాదు చెడు నుండి మనస్సు ను కళ్ళను అదుపులో ఉంచ వలెను, మెదడును, చెవులను, నాలుకను రక్షించుకోవాలి. అంటే అసభ్యకరమైన మాట్లాడుట, ఆలోచించుట చేయరాదు. ఇది పురుషులకు, స్త్రీలకు కూడా. 
          పై చెప్పిన ఖుర్ఆన్ వాక్యంలో పరదా యొక్క ఉద్దేశ్యాన్ని వివరించింది. గుర్తింపబడటానికి, వేదింపబడకుండా ఉండేందుకు. 
       ఉదాహరణకు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు అనుకోండి, ఇద్దరు వయస్సులో ఉన్నవారు. వారిలో ఒక ఆమె ఇస్లాం పద్ధతిలో పరదా వేసింది. రెండో ఆమె వెస్ట్రన్ స్టైల్ లో మిడ్డీ, టి-షర్టు వేసుకొని, ఇద్దరు రోడ్డు మీద వెళ్ళుతున్నారు. రోడ్డుపక్క ఆకతాయి కుర్రాళ్ళు ఉన్నారనుకోండి వారి దృష్టి ఎవరి మీద పడుతుంది? వారు ఏ అమ్మాయిని టీజ్ చేస్తారు? ఒక్క సారి ఆలోచించండి. పరాయి వాళ్ళు చూచి ఆనందించడానికా స్త్రీలు. ఈలాంటి వస్త్రధరణ వల్ల వారి మనస్సులలో వాంఛలు రేకేత్తంప చేయటానిక? మీ అక్క చెల్లెళ్ళు, తల్లులు, మీ భార్యలకు మీరు ఇలాంటి స్వేచ్చ ఇస్తార? దిన్ని స్వేచ్చ అంటారా? ఒక్క సారి ఆలోచించండి. 
         స్త్రీకి స్వేచ్చ ఇవ్వడం అంటే విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం కాదు. వారికి గురవం ఇవ్వాలి. రక్షణ కల్పించాలి. ఆడ పిల్ల పుడితే మైనస్  పుట్టింది అని భావించే వారు ఏంటో మంది ఉన్నారు. స్త్రీలకు ఎంతో స్వేచ్చనిచ్చం అని చెప్పే అగ్రరాజ్యం అమెరికా అక్కడ స్త్రీలపై అత్యచారాలు, హత్యలు సగటున రోజుకు 1900 జరుగుతున్నాయని FBI రిపోర్టులో  తెలిపింది. 1990 లో చేసిన సర్వే రిపోర్టు సగటున రోజుకి 1,756 మానభంగాలు జరుగుతున్నాయి. 1992-93 లో ఈ లెక్క ప్రకారం చూస్తే అమెరికా లో ప్రతి 32 సేకoడునకు ఓ స్త్రీ మానభంగానికి గురి అవుతుoదన్నమాట. 
                  ఇలా జరగటానికి మూల కారణం ఏమిటి? విచ్చలవిడితనం, స్త్రీలు, పురుషులను మానభంగానికి పురిగోల్పే విధంగా వారి వస్త్రధారణ మాత్రమేనని కచ్చితంగా చెప్పవచ్చు. 
                     మానభంగo  చేసేవాడికి కటిన శిక్ష లేక పోవడం, ఇలాంటి స్వేచ్చవలన నష్ట పోయేది స్త్రీ సమాజం. స్త్రీలకు స్వేచ్చనిచ్చాం అని చెప్పేవారు వారి అందాలను దోచుకుంటున్నారు. అందాల పోటీలు పెట్టి వారి అంద  చందాలను కొలవటం వారిని అర్ధనగ్నంగా  చేసే వివధ భoగిమలలో ఫోటోలు తీసి వ్యాపారం చేస్తున్నారు. టి.వి లలో వస్తున్న  ప్రకటనలలో 10 రూ॥లు సబ్బు అమ్మటానికి, ఆమెను తడిపి ఆమె అంగాల్ని  ప్రదర్శిస్తున్నారు. పైగా స్త్రీలకు స్వేచ్చనిచ్చాం అంటున్నారు. ఇది నిజమా? ఇదేనా స్త్రీలకు ఇచ్చే స్వేచ్చ! ఇలాంటి ఆలోచనలు కలిగిన వారికి ఇస్లాంను నిందించే హక్కు ఉందంటారా? 
జ్ఞాన నేత్రాలు తెరిచి ఆలోచించండి.   
  
    4. ఒక చేతిలో ఖడ్గం, మరోచేతిలో ఖుర్ఆన్ పట్టుకొని ఖుర్ఆన్ను      అనుసరించండి (ఇస్లాం లో చేరండి ) లేదా ఖడ్గాన్నికి బలి అవుతారు అని    బెదరించడం వలన ఇస్లాం వ్యాపించింది అంటారు ?
  ఇస్లాం అంటే ఏమిటి? ఇస్లాం ప్రచారం ఎలా చేయాలి? అని విషయాలు ఖుర్ఆన్ ద్వారా తెలుసుకునే ముందు ఇస్లాం వ్యాపించిన దేశాల గురించి తెలుసుకుందాం. 
        ముస్లిములు స్పెయిన్ దేశాన్ని 800 సం॥లో పాటు పాలించారు ఆ తరువాత క్రైస్తవులు పాలించారు. క్రైస్తవులు పాలించే కాలం లో ఒక ముస్లిం కూడా ఆ ప్రాంతంలో లేకుండా చేసిరి. కాగ బిగ్గరగా అజాన్ (నమాజ్ కొరకు పిలిచే పిలుపు) ఇచ్చే అవకాశం ఉండేది కాదు. అరబ్బు దేశం అంటే ముస్లిం దేశం అని విడమర్చి చెప్పనవసరం లేదు. అరబ్బు దేశాన్ని ముస్లింలు 1400 సం॥ల నుండి పాలిస్తున్నారు. మధ్యలో కొంత కాలం ఫ్రెంచి వారు, బ్రిటిష్ వారు పాలించినా ఇప్పటికి అరబ్బు  అంత ముస్లింల ఆదినంలోనో  ఉంది. అరబ్బులో పుట్టుకతోనే(తాతలు, తండ్రుల కాలం నుండి ) క్రైస్తవులుగా ఉన్న వారు కనీసం 14 మిలియన్ మంది ఉన్నారు. 
                భారత దేశానికి వస్తే మన దేశాన్ని ముస్లింలు 1000 సం॥ల పాటు పాలించారు. కాని ఇక్కడ ముస్లింలు 20% మంది మాత్రమె ఉన్నారు. ( వారి కాలంలో కొంత మంది రాజులు వారి స్వార్ధం కొరకు కడ్గాన్ని వాడారన్న దానిలో సందేహం లేదు. ఏ విధంగానైతే ఈ కాలం లో ముస్లింలపై వాడుతున్నారో). 
            ఇండోనేషియా, మలేశియాలో కూడా ముస్లింలు ఉన్నారు. మరి అక్కడ ముస్లింలు పాలించలేదే? వారిపై దండెత్తలేదే. 
           తుర్పు ఆఫ్రికా కోస్తా ప్రాంతంలో అయితే ఇస్లాం చాలా తోందరగా వ్యాప్తి చెందింది అక్కడికి కూడా ముస్లింల సైన్యం వేల్లలేదే. 
          ప్రముఖ చరిత్రకారుడు డిలేసిఓలేరి రచించిన "ఇస్లాం ఎట్ ది క్రాస్ రోడ్ " అను పుస్తకంలో 8వ పేజిలో ఇలా వ్రాసారు "ఇస్లాం ధన బలంతో గాని భుజబలంతో గాని వ్యాపించలేదు " అని ఆయన నొక్కి వాక్యాణిoచారు . 
          రీడర్స్ డైజెస్ట్ అనుమాన పత్రిక 1934 సం॥ నుండి 1984 సం॥ మధ్యకాలంలో వివిధ వ్యాప్తి చెందిన సంఖ్యలను సర్వే చేసి వ్రాసిన రిపోర్టులో ఇలా వివరించారు. 
         
                 1934 సం॥ నుండి 1984 సం॥ మధ్యకాలంలో ఇస్లాం 235% వ్యాప్తి చెందితే క్రైస్తవ మతము 47% వ్యాప్తి చెందింది అని వివరించారు. 
                ఎక్కువ అమెరికా, యూరోప్, ఆఫ్రికా దేశాలలోనే ఇస్లాం వేగంగా వ్యాపించింది అని తెలుస్తుంది. మరి వీరందరిని ఎవరు బెదరించి ఇస్లాం వైపుకు మరలిస్తున్నారు.ముస్లింలు బెదరించి ఇస్లాంలో చేర్చినట్లయితే అరబ్బుదేశంలో 14 మిలియన్ల మంది క్రైస్తవులు వుంటారా? భారతదేశాన్ని ముస్లింలు 1000 సం॥లు పాలించినా 20% మంది మాత్రమే ముస్లింలు ఎందుకు ఉన్నారు. ఇస్లాం అంటే శాంతి సమాధానము. ఇస్లాం ధర్మాన్ని ఆచరిమ్పజేసే విషయంలో ఎలాంటి నిర్భందము బలత్కారము లేదు అని ఖుర్ఆన్ వక్కాణిoచి చెపుతున్నది.
             ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్‌), దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని ('తా'గూత్‌ను) తిరస్కరించి, అల్లాహ్‌ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. 
(ఖుర్ఆన్  2వ సూర బఖర 256వ వాక్యం )
                 (ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమరీతిలో వాదించు. నిశ్చయంగా, నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైన వాడెవడో తెలుసు. మరియు మార్గదర్శకత్వం పొందిన వాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు.  
(ఖుర్ఆన్  16వ సూర నహ్ల్ 125వ వాక్యం ) 
                    ఇస్లాం గూర్చి ప్రచారం చేస్తే విధానాన్ని కూడా ఖుర్ఆన్ బోధించింది. దీనిని తూ.చ. తప్పక పాటించువాడే  నిజమైన ముస్లిం. 
                    అలా అయితే ముస్లింలు యుద్ధాలు ఎందుకు చేస్తారు అని ప్రశ్నిoచవచ్చు. పై వచనం తర్వాత ఈ విధంగా తెలపడం జరిగింది. 
                   ఒకవేళ మీరు ప్రతీకారం చేస్తే కేవలం మీపై దౌర్జన్యంజరిగిన మేరకే ప్రతీకారం చెయ్యండి . కాని మీరు సహనం వహిస్తే నిశ్చయంగా, సహనం వహించేవారికి ఎంతో మేలు కలుగుతుంది.  
(ఖుర్ఆన్  16వ సూర నహ్ల్ 126వ వాక్యం ) 
                      పై వాక్యమును బట్టి తెలుస్తున్నది ఏమిటంటే, ఎవరైనా దౌర్జన్యo చేసినప్పుడు వారిపై తిరగబడడంలో తప్పులేదు. ఇస్లాంను అనగద్రోక్కడానికి ప్రయత్నిoచినప్పుడు   తిరుగుబాటి తప్పులేదు అన్నది ఇస్లాం బోధనా సిద్ధాంతం. 
                      ఎవరో కొందరు రాజ్యాధికార కాంక్షతో యుద్ధాలు చేస్తే అది ఇస్లాo కు సంబంధం లేదు మరిన్న వివరాలకు చూడండి. 

5. చాలామంది ముస్లింలు టెర్రరిజాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఇస్లాం బోధిస్తుంటే మరి ఈ హింసా మార్గం వైపునకు ఎందుకు వెళ్ళుతున్నారు. 
              కొన్ని ప్రచార సాధనాల పుణ్యామా అని ముస్లిమందరిని టేర్రరిష్టులుగా చూస్తున్నారు. ఇది ముస్లింలకు చాల బాధ కల్గించే విషయం. ఒక విషయం మనం గుర్తించాలి. టేర్రరిజం అనేది ఎలా పుట్టింది? కొందరు పెత్తందార్లు బడుగువర్గాలపైన, పేదవారిపైన నిస్సహాయులపై దురాగతాలు చేస్తున్నప్పుడు కొందరు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పెత్తoదారులపై తిరగబడ్డారు. వారినే తీవ్రవాదులని పేరు పెట్టారు. మీరు పెత్తoదారులకు శత్రువులు అయితే నిస్సహాయులకు ఆపద్భాన్దవులు. 
             ఏ దేశంలోనైనా ఓ తెగ వారిపై అన్యాయం జరిగితే వారు తిరుగుబాటు చెయ్యడం సహజం. వారిలో కొందరు హింసామార్గాన్ని ఎంచుకుంటే కొందరు అహింసను ఆయుధంగా ఎంచుకుంటారు.కొందరు కలం ద్వారా తిరుగుబాటు చేస్తే, మరికొందరు తుపాకీ ద్వారా తిరుగుబాటు చేస్తారు. కాని వారి లక్ష్యం ఒక్కటే. భారతదేశంలో కూడా బ్రిటిషు వారి నిరంకుశ పరిపాలనను అంతమొందించడానికి భారత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు హింసా మార్గాన్ని ఎంచుకున్నారు. వారిని బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రవాదులుగా ముద్రవేసింది. కాని మనం వారిని స్వాత్యంత్రం సమరయోదులుగా గౌరవిస్తాం. 
                    ముస్లింలు టెర్రరిస్టులుగా మారుతున్నారు అంటే వారి, వారి స్థానిక సమస్యలు వారిని ఆవిధంగా చేస్తున్నాయి. ఇస్లాం ఎప్పుడూ తీవ్రవాదాన్ని ప్రొత్సహించదు. ''నిశ్చయంగా – ఒక వ్యక్తి (హత్యకు) బదులుగా గానీ లేదా భూమిలో కల్లోలం వ్యాపింపజేసి నందుకు గానీ, గాక – ఎవడైనా ఒక వ్యక్తిని (అన్యాయంగా) చంపితే, అతడు సర్వ మానవజాతిని చంపినట్లే. మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే, అతడు సర్వ మానవజాతి ప్రాణాలను కాపాడి నట్లే!'' మరియు వాస్తవానికి, వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మా ప్రవక్తలు వచ్చారు, అయినా వాస్తవానికి వారిలో పలువురు భూమిలో అక్రమాలు చేసేవారు. 
             (ఖుర్ఆన్  5వ సూర మాఇ'దహ్ 32వ వాక్యం )
6. ఇస్లాం శాంతి బోధిస్తుంది అంటారు. మరి జీవహింస చేస్తారు. అంటే మాంసహారము భుజిస్తారు. ఎందుకు?
ముందుగా ఓ మాట ముస్లిం అయినవాడు తప్పనిసరిగా మాంసాహారము తినాలని నిబంధన ఏది లేదు . మాంసాహారం తినుట వలన ఎలాంటి తప్పులేదు.విద్యాపరంగా చూసిన మాంసాహారము తినుట వలన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మాన్సహారములో ప్రోటిన్స్ అధికముగా ఉంటాయి. మన శరీరమును అవసరమైన 8 రకాల ఎయినోయాసిడ్స్ మన శరీరములో ఉత్పత్తి కాదు అది మనకు మాంసాహారము వలెనే లబిస్తుంది. అంతే కాదు ఐరన్, విటమిన్  బి1 మరియు నియోసిన్ మాంసాహారము ద్వారా లభిస్తుంది. 
              ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి. మీ కొరకు పచ్చిక మేసే చతుష్పాద పశువులన్నీ (తినటానికి) ధర్మ సమ్మతం ('హలాల్) చేయబడ్డాయి; మీకు తెలుపబడిన పశువులు తప్ప! మీరు ఇ'హ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడటం మీకు ధర్మసమ్మతం కాదు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది శాసిస్తాడు.
(ఖుర్ఆన్  5వ సూర మాఇ'దహ్ 1వ వాక్యం )
మాంసాహారాన్ని ముస్లింలే కాదు ముస్లిం మేతరులు కూడా తింటారు. హిందూ పురాణాల ద్వారా కూడా మాంసాహారము తినుట రుజువు అగుచున్నది. దేవుడు ఈ సృష్టిని మానవుని ఉపయోగం కోసం సృష్టించాడు. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఖుర్ఆన్ వాక్యాలలో తెలియజేశాడు.  
                       మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో నుండి (కొన్నిటి మాంసం) మీరు తింటారు. 
(ఖుర్ఆన్  16వ సూర న'హ్ల్ 5వ వాక్యం )
                          ఓప్రజలారా! భూమిలోనున్న ధర్మ సమ్మతమైన పరిశుద్ధమైనవాటినే తినండి. మరియు షై'తాన్‌ అడుగుజాడలను అనుసరించ కండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు. 
(ఖుర్ఆన్  2వ సూర బఖర 168వ వాక్యం )
            మరియు నిశ్చయంగా, మీ పశువులలో మీకు ఒక గుణపాఠముంది. మేము వాటి కడుపులలో ఉన్నది (పాలు) మీకు త్రాపు తున్నాము. మరియు వాటిలో మీకు ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటి (మాంసం) మీరు తింటారు.
మరియు వాటి మీద మరియు ఓడల మీద మీరు సవారిచేస్తారు. 
(ఖుర్ఆన్  23వ అల్-ము'మినూన్ 21-22 వ వాక్యం )
                     పై ఖుర్ఆన్ వాక్యాలను బట్టి కొన్ని రకాల పశువులు ద్వారా మనిషికి జీవనోపాధి కల్గుతుంది. వాటిని మనిషి యొక్క అవసరాల నిమిత్తమే దేవుడు సృష్టించాడు అని తెలుస్తుంది హిందువుల ధర్మశాస్త్రం:మనస్మ్రుతి 5,30-31 మరియు 5లోను నారోక చోట 5,38-40. 
యజ్ఞ్యార్ధం పశావస్య్రుష్ట : స్వయమేవ స్వయంభువా,
యజ్యోజ్ఞ స్య భూత్యై సర్వస్య తస్మద్యజ్యేజ్ఞ  వధో  వధ : 
                   బ్రహ్మ తానుగానే పశువులను యజ్ఞమునిమిత్తమైసృజించెను. కనుక నిజగత్తుయోక్క మేలుకై  యజ్ఞము నిర్మితమైనది. కావున యజ్ఞమునందు పశువధము వదముగాదు. 
(మనస్మ్రుతి:- సవ్యాఖ్యానాoధ్రతాత్పర్యము 5:39, పేజి నెం:239)
( మహాభారతంలో అనుశాశన పర్వ భాగం 88 ధర్మరాజు యుదిష్ట భీష్ముడు)
                    సృష్టిలో మాంసాహారము  తినే జంతువులు ఉన్నాయి. శాఖహారము తినే జంతువులు ఉన్నాయి వాటిని పరిశీలిద్దాం. 
                    శాఖహారము తినే జంతువులు పళ్ళవరస చూస్తే ఒకే వరుసలో ఉoడి కోరపళ్ళు (సూది మొను ఉన్న పళ్ళు) లేకుండా ఉంటాయి వాటికి నెమరువేసే పళ్ళు మాత్రమె ఉంటాయి. 
                     మాంసాహారము తినే జంతువులు పళ్ళ వరసను పరిశీలిస్తే వాటి పళ్ళు పదునుగా కోరపళ్ళు సూది మొను ఉన్నపళ్ళు ఉంటాయి. 
                    శాఖహారము తినే జంతువులకు మాంసాహారముపెడితే అవి జీర్నించుకొలేవు. మాంసాహారము తినే జంతువులకు శాఖాహారము పెడితే అనారోగ్యం పాలు అవుతాయి. 
                   మనషి యొక్క పళ్ళను పరిశీలిస్తే మాంసాన్ని తినగల పళ్ళు, శాఖాహారాన్ని తినగలపళ్ళు  ఉన్నాయి. అలానే మనిషి మాంసాన్ని జీర్నించుకొగలడు. ఎందుకంటే దేవుడు అతని పొట్టను, శరీరాన్ని ఆ విధంగా సృష్టించాడు కాబట్టి.  
                     జీవహింస చేయరాదు అని చెప్పేవారు శాఖాహారము కూడా తినరాదు. చెట్లలో కూడా జీవం ఉంటుందని పరిశోధనలలో తేలింది.అవి కూడా బాధపడతాయని, సంతోషిస్తాయని తెలుస్తుంది.అమెరికాలో ఓ వ్యవసాయదారుడు చెట్లపై పరిశోధన చేసి వాటికి నీరు అవసరం అయినప్పుడు శబ్ధం చేస్తాయని కనుగొన్నాడు.  ఎలా అయితే చంతిపిల్లావాడు ఆకలి వేసినప్పుడు పాలకోసం ఏడుస్తాడో, అలానే చెట్లకు నీరు అవసరం అయినప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తాయని ఆయను కనుగొన్నాడు. పశువుల పాలు తాగుతారు. ఇది శాఖాహారమా లేక మాంసాహారమ? 
7. ముస్లింలు జంతువులను జబాచేసి విధానము. జంతువులను విపరీతమైన బాధకు గురి చేసి వధించినట్లు ఉంటుంది. ఈ విధానం క్రూరంగా వదించడం సమంజసమా?
ముస్లిం  చేసే  ప్రతీ పని తన ఇష్టానుసారం చెయ్యడు . ఖుర్ఆన్ మరియు ప్రవక్త మొహమ్మద్ (స . అ . స ) వారు చెప్పిన విధంగానే చేస్తాడు చెయ్యాలి కూడా . ఖుర్ఆన్ మరియు ప్రవక్త వారి భోధనలలో వివేకంతో దాని వెనుక పరమర్ధం తప్పక ఉంటుంది. అందులో ఎటువంటి  సందేహము లేదు . 
                         అలానే జబా చేసే విధానం చూడటానికి క్రురంగా కనిపించవచ్చు. కానీ ప్రవక్త (స . అ . స ) వారు జంతువుని జుబా చేసే విధానం జబా చేయక ముందు తిసుకోవలసిని  జాగ్రత్తలు  వివరించారు .అదేమిటో చుడండి . జబా చేసే కత్తి పదునుగా ఉండాలి . జబా చేసే జంతువు ఏదుట కత్తిని నురరాడు . ఒక జంతువు ఏదుట మరో జంతువును జబా చేయరాదు. జంతువును పరుండబెట్టిన వెంటనే జబా చేయాలి .
                                                                                   (హదీస్ సహిముస్లిం 5వ భాగం 209వ పేజి )
ఇన్ని విషయాలు మనకు ఏ మత గ్రంథములలోను కనిపించదు. జంతువు ముందు కత్తి పదును చేస్తే భయంతో బెదిరిపోతుంది . తన ఏదుట మరో జంతువును జబా చేసినచో అది భయంతో వణికిపోతుంది . దాన్ని పరుండబెట్టి ఆలస్యం చేసిన అది కృంగిపోతుంది. పూర్తి  ప్రాణం పోక ముందే చర్మం వలచిన దానికి భాద కల్గుతుంది. 
               ఇన్ని జాగ్రత్తలు చెప్పి జబా చేసే విధానం సగం మేడనే కోయ మనదంలో ఆంతర్యం ఉంటుంది కదా ? అదేమిటో  తెలుసుకుందాం! మెడ ఒక్కసారిగా నరకడం వలన మెదడుకు వెళ్ళే నరాలు తెగిపోయి గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగిపోతుంది. దాని వాళ్ళ రక్తం ఏకడికక్కడే ఉండిపోయి మాంసంలో ఇంకిపోతుంది.  మెడ ఏముక ఒక్కసారిగా విరుగుట వలన అది విపరీతమైన భాధకు గురి అవుతుంది. రక్తం శరీరంలో ఉండిపోవడం వలన ఆ మాంసం తినుట వలన మన ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది. సూక్ష్మజీవులు రక్తంలో ఉంటాయి. అదే ఇస్లాం పద్దతిలో జబా చేయటం వలన ఉపొయొగమ్ ఏమిటంటే జబా చేసేటప్పుడు కంట రక్తనాలాన్ని కోయాలి. అలా చేయటం వలన కొంత సమయం వరకు గుండె పని చేస్తుంది. దాని వాళ్ళ శరీరంలో ఉన్న రక్తం అంతా తెగిన రక్త నాలం గుండె బయటకు వచేస్తుంది. రక్తంతోపాటు సూక్ష్మజీవులు కూడా బయటకు వచ్చెస్తాయి.  జంతువు కొట్టుకోవడం నొప్పివల్ల  కాదు. శరిరంలో ఉన్న రక్తం బయటకు రావడం వలన మాంసం పరిశుభ్రంగా ఉంటుంది. 
                             కావున మీరు అల్లాహ్నే ఆరాధించే వారైతే, ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుధ్ధమైన ఆహారాలనే తినండి మరియు అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి. 
                                                                               (  ఖుర్ఆన్ 16వ సూర అన్ నహ్ల 114వ వాక్యం )
ఇస్లాం పద్ధతి ప్రకారంగా జబా చేసిన జంతువు మాంసం నరికిన మాంసం కంటే ఏక్కువ సమయం నిలువు ఉంటుంది. రూచిగ కూడా ఉంటుంది . ఇస్లాం పరిశుభ్రత నేర్పుతుంది. 
8. ఏలాంటి పదార్ధాలు తింటే తినేవారి ప్రవర్తన కూడా వాటిలనే ఉంటాయి అని సైన్స్ చెబుతుంది. మరి మాంసాహారము తినుట వలన వారి ఆలోచనా విధానo కూడా మూర్ఖంగా ఉంటదా? 
                    వీటికి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే క్రూర జంతుమాన్సం తినుట వలన తినేవారి ప్రవర్తన , వారి ఆలోచనలు క్రురంగా ఉండవచ్చు తినకపోయిన కొందరు హృదయాలు కటినంగా, క్రురంగా ఉన్నవారు లేరంటారా?  వారి స్వార్ధం కోసo, ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్న వారు లేరంటారా? 
                   అయిన, ముస్లింలు సాధు జంతువుల మాంసమే తింటారు. దేని పాలు త్రాగావచ్చో, వాటి మాంసాన్ని మాత్రమె తింటారు. ముస్లిం అనువాడు ఖుర్ఆన్ మరియు ప్రవక్త (స.అ.స) వారు వాటిని అయితే తినుట అనుమతించారో వాటి మాంసాన్నే తింటారు. 
              “ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్య రాస్యుడైన ఈ ప్రవక్తను అనుస రిస్తారో!ఎవరి ప్రస్తావన వారి వద్దవున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మ తంచేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్బంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు.”
ఖుర్ఆన్ 7వ సూర అల్-అ'అరాఫ్ 157వ వాక్యం )
              తినుటకు అనుమతించిన జంతువులను ఉదాహరణకు - మేక, గొర్రె, ఆవు, గేదె, ఎద్దు మొదలైన జంతువులను, పక్షువులు.   తినుటకు అనుమతించిన కొన్ని జంతువులను ఉదాహరణక - కోరలు ఉన్న జంతువులు అంటే పిల్లి, పులి, సింహం, నక్క, కుక్క, ఎలుగుబంటి, ఎలుక, మొసలి మొ॥నవి.  పక్షువులలో గ్రెద్ద, డేగ, కాకి, గుడ్లగూబ, రాబందు ఇలాంటి మరికొన్ని పక్షులు. ముస్లింలు తినే జంతువులు క్రూర జంతువులు కాదు. పైగా మనుషులతో కలిసిమెలిసి ఉండే సాధు జంతువులు. ఇలాంటి జంతువులు మాంసం తినుట వలన క్రూరంగా ప్రవర్తిస్తారు అనడంలో అర్ధం లేదు. 
9. ముస్లింలు విగ్రహారాధన చెయ్యరు కదా! మరి కాభా వైపు తిరిగి నమాజు ఎందుకు చేస్తారు. దాని చుట్టూ ఎందుకు ప్రదక్షణలు చేస్తారు? 
                     ముస్లింలు కాబాని దైవ స్వరూపంగా భావించి కాబావైపునకు ముఖము పెట్టి నమాజు చెయ్యరు. కాబాని దిక్కుగా మాత్రమె తలంచి అటువైపు తిరిగి నమాజు చేస్తారు. ఇదే విషయం ఖుర్ఆన్లో ఉంది. 
                   (ఓ ప్రవక్తా!) వాస్తవానికి మేము, నీవు పలుమార్లు నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తడం చూశాము. కావున మేము నిన్ను నీవు కోరిన ఖిబ్లావైపునకు త్రిప్పుతున్నాము. కావున నీవు మస్జిద్‌ అల్‌-'హరామ్‌ వైపునకు నీ ముఖాన్ని త్రిప్పుకో! ఇకపై మీరంతా ఎక్కడ ఉన్నా సరే (నమా'జ్‌ చేసేటప్పుడు), మీ ముఖాలను ఆ వైపునకే త్రిప్పుకోండి. మరియు నిశ్చయంగా, గ్రంథం గలవారికి ఇది తమ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యమని బాగా తెలుసు. 

(ఖుర్ఆన్  2వ సూర బఖర 144 వ వాక్యం )
                     నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్తలోకాల ప్రజలకు మార్గదర్శ కత్వాన్ని ప్రసాదించేది. 
(ఖుర్ఆన్  3వ సూర ఆలె-'ఇమ్రాన్ 96 వ వాక్యం )  
                   ఇస్లాం అందరిని ఒకే సంఘంలా జీవించమంటుoది. సమూహికంగా నమాజు చదవడం తప్పనిసరి చేసింది. వారి దిక్కు ఒకటే చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ముస్లిం అనువాడు ప్రార్ధన చేయునప్పుడు అతని ముఖం కాబా వైపు త్రిప్పుట సరి. కాబా ప్రపంచానికి కేంద్ర బిందువై యున్నది. 
                   ప్రముఖ హదీస్ గ్రంధాలలో ఇలా ఉంది.ఒకసారి ఉమర్ (రజి) వారు (ఈయన ప్రవక్త ముహమ్మద్ (స.అ.స) వారి సహచారులలో ఒకరు) ప్రవక్త వారి తరువాత అబుబకర్ (రజి) ఇస్లాo కు సారధ్యం వహించారు. ఆతరువాత ఉమర్ (రజి) ఇస్లాం సారధ్య బాధ్యతలు చేపట్టారు. ముహమ్మద్ (స.అ.స) ప్రవక్త సహచారులలో అగ్రగణ్యులలో  ఈయన ఒకరు. కాగా వద్ద నల్లటి రాయి ఉంటుంది. దానిని హజారే అస్వాద్ అంటారు. కాబాకి ఎవరు వెళ్ళినా దాన్ని తాకుతారు. ఆరాయిని ఉమర్ (రజి), వారు తాకుతూ ఇలా అన్నారు.ఓ రాయి నివు నా దృష్టిలో ఓరాయివి మాత్రమే. నివు లాభ నష్టాలు చేయలేవు. ప్రియ ప్రవక్త నిన్ను తాకుట నేను చూసాను. అందుకే నేను నిన్ను తాకుతున్నాను.
(హదీస్, సాహిబుఖారి-2వ భాగం, 50వ ప్రకరణం హదీస్ నం. 594 పేజి నెం. 599) 
                           ముస్లింలు పుణ్యక్షేత్రంగాభావించే మక్కాలో శివలింగం ఉందికదా అని అనేవారు మన దేశంలో బ్రహ్మకుమారీలు వున్నారు. ఇది కేవలం స్వార్గం నుండి ఆదాము వారు తెచ్చిన రాయి పలక మాత్రమే. ఇది దైవం మాత్రం కాదు. శివలింగం అసలే కాదు. 
                           ముస్లింలు మక్కా జయించిన తరువాత  ముహమ్మద్ (స.అ.స) వారు కాబాలో ప్రవేశించి బిలాల్ (రజి) గారికి కాబా మసీదు మీదకు ఎక్కి అజా(నమాజు కొరకు పిలిచే పిలుపు) ఇవ్వమన్నారు. ముస్లింలు కాబాను ఆరాదిన్చినట్లై తే దానిపైకి ఎక్కి తొక్కుతారా? ఒక్కసారి వివేకంతో ఆలోచించండి. 
                          ఇది కేవలం ఇస్లంపై అవగాహన లేనివారు అన్నమాటలు మాత్రమే.
 చుడండి ఖుర్ఆన్ వచనాలు 2. 125
10. ముస్లిమేతరులను మక్కాలోనికి ఎందుకు అనుమతించరు?
                         విశ్వసించిన  ప్రజలారా! ముష్రిక్కులు అపరిశుద్ధులు. కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిదెహరామ్ దాదిదాపులకు కూడా రాకూడదు.
 (ఖుర్ఆన్  9వ సూర అత్-తౌబహ్ 28వ వాక్యం )
                             ఏ దేశంలోనైనా ఇతరులకు ప్రవేశం కల్పించుటకు కొన్ని నిబంధనలు పెడతారు. ఇది సమాజం. మన దేశంలోనే చూద్దాం. నేవీ, పొర్టు, శిపయార్డు ఇలాంటి సంస్ధలోనికి వెళ్ళాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ సంస్ధ అధికారిచే దృవీకరణ పత్రం (పాస్) ఉండాలి. అలా కాదని నేను ఈ నగర పౌరిడ్ని నన్ను ఎందుకు అనుమతించిచరు అంటే ఏమైనా అర్ధం ఉందా? 
                             విదేశాలకు వెళ్ళాలంటే వీసా తీసుకోవాలి. వీసా మనకు మంజూరు చేసే ముందు వారు పెట్టిన నిబంధనలకు మనం కట్టబడి ఉండాలి. అప్పుడు గాని మనకు వీసా మంజూరు చెయ్యరు. 
                              అమెరికాకు వెళ్ళాలంటే చాలా ఎక్కువ నిబంధనలు ఉంటాయి. అంత సులభంగా అమెరికాకు వీసా దొరకదు. 
                              సింగపూర్ కి వీసా ఇచ్చేముందు వారు పెట్టిన నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఓ పత్రం పై సంతకం చెయ్యాలి. ఆ పత్రంలో మొట్టమొదటి నిబంధన ఎటువంటి మాదకద్రవ్యాలతో పట్టుబడినా మరణశిక్ష విధించబడుతుంది. అని ఉంటుంది. ఏమిటి దీనికే ఇంత పెద్దశిక్ష మా దేశంలో అలాలేదే. దానికి మేము సమ్మతించము అంటే కుదురుతుందా?
                                అలానే మక్కాలోకి వెళ్ళాలంటే ముస్లిం అయి ఉండాలని ఒక నిబంధన అనగా సర్వసృష్టికర్త అల్లాహ్ ఒక్కడేనని ముహమ్మద్(స.అ.స) దేవుని ప్రవక్త అని నిబంధనలకు లోబడి జీవితం గడుపుతామని మనస్పూర్తిగా, వాచ, కర్మలకు లోబడి ఉన్నవారికి మాత్రమె అనుమతి లభిస్తుంది. (లా ఇలాహి ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ )
11. ఇస్లాం పంది మాంసాన్ని ఎందుకు నిషేదించింది?
                         పంది మాంసాన్ని ఖుర్ఆన్ మాత్రమె కాదు బైబుల్ కూడా నిషేదించింది. ఇది చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ముందు ఖుర్ఆన్ వాక్యం చూద్దాం.
                         అల్లాహ్ మీకు నిషిద్ధం చేసినవి ఇవి: నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు / పక్షి) రక్తం, పంది మాంసం, అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరులపేర) జి'బ'హ్ చేయబడినది (పశువు / పక్షి మాంసాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా (అల్లాహ్) నియమాలను ఉల్లఘించే ఉద్దేశంతో కాక, (ఆకలికి) తాళలేక, గత్యంతరంలేని పరిస్థితిలో (తింటే); నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.  
(ఖుర్ఆన్  16వ సూర అన్-న'హ్ల్ 115వ వాక్యం )
చూడండి  ఖుర్ఆన్ వచనాలు 2:173,5:3,6:145
                                   బిబుల్లోని: పంది విడిగా నుండి రెండు డెక్కలు గలదిగాని అది  నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము, వాటి మాంసము మీరు తినకూడదు. వాటి కళేబరములను ముట్ట కూడదు. అవి మీకు అపవిత్రము. 
(లేవియకాండం 11వ అధ్యాయము 7-8 వాక్యములు )
                      మరియు పండి రెండు డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది హేయము. వాటి మాంసము తినకూడదు. వాటి కళేబరమును ముట్టకూడదు. 
(ద్వితియోపదేశాకాండం 14వ అధ్యాయము 8 వాక్యము) 
                       అదే విధంగా వైద్యశాస్త్ర ప్రకారంగా కుడా పంది మాంసం తినుటవలన 70 రకాల రొఆలు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. 
                      మనిషి కడుపులో పెరిగే ప్రాకుడు పురుగులు, చిన్న నులు పురుగులు పందిమాంసంలో ఎక్కువ ఉంటాయి. ఇలాంటి మాంసాన్ని తింటే అవి శరీరంలోకి  ప్రవేశించి గుడ్లు పెడతాయి.ఆ గుడ్లు రక్తనాళాల ద్వారా మొదడులోనికి ప్రవేశిస్తే మొదడు పడిపోతుంది. గుండెలోకి ప్రవేశిస్తే గుండె పడిపోతుంది. అంతే కాక  పండి మాంసంలో  క్రొవ్వు అదికంగా ఉంటుంది. పంది  మాంసం తినటం వలన రక్త నాళలలో క్రొవ్వు చేరుతుంది అలా చేరుట  వలన రక్తపోటు వస్తుంది. అమెరికా వాసులు అధిక శాతం రక్త పోటుతో బాధపడుతున్నందుకు కారణం పంది  మాంసం తినటమే.  
                       పంది అంత అసహ్య కరమైన జంతువూ మరొకటి లేదు. అది ఎంత సేపు మురికి గుంటలోనే ఉంటుంది. మలాన్ని తింటుంది. పందిలో  మరో విచిత్ర గుణం ఉంది. అదేమిటంటే తానూ జతకట్టిన ఆడ పంది మీదకి మరో పందిని పంపుతుంది. జతకట్టమని పురిగొల్పుతుంది. ఇలాంటి గుణం మరే జంతువులలో కనబడదు. 
                        అదే గుణం అమెరికా వాసులలో కనిపిస్తుంది. పార్టిలలో డాన్సులు చేస్తూ ఒకరి భార్య మరొకరికి నచ్చినచో ఆ స్త్రీని  రమించుటకు తీసుకోని పోవచ్చు. ఆ స్త్రీ యొక్క భర్త మరొక స్త్రీ తో రమించినచో   ఎటువంటి అబ్యంతరం లేదు. ఇది పాశ్చత్తుల సంస్కృతి పండి మాంసాన్ని తినుట వలన ఇలా సంక్రమించి ఉంటుంది. 
12. సారాపై నిషేధమెందుకు ?
ప్రశ్న : ఇస్లాంలో సారా ఏందుకు నిషేదించబడింది?
జవాబు: సారా అనేది మానవ సమాజానికి ఒక అభిశాపం లాంటిది. దిన్ని వాడటం వాళ్ళ లెక్కలేనంతమంది మృత్యువాతపడ్డారు. దిని సేవనం ప్రపంచంలోని లక్షలాది మందిని దుఖానికి, భాదలకు గురిచేస్తు వచ్చింది. సమాజానికి ఏదురయ్యే అనేక సమస్యలను ఈ సారాయే ముఖ్య కారమవుతున్నది. నేరాల సంఖ్యలలో ప్రతిదినం ఏదైతే అభివృద్ధి కనబడుతుందో, మనుషుల మానసిక రోగాలలో ప్రతినిత్యం కనబడుతున్న పురోగమనం, ఇంకా సమాజంలో వేల, లక్షల సంఖ్యలో ప్రతి నిత్యం చిన్నభిన్నమవుతున్న సంసారాలు, వీటన్నిటికి మూలకారణం ఈ మహమ్మరియే. ఇవన్ని దానియొక్క విధ్వంసక శక్తికి ప్రతిరుపాలే ! 
1.పవిత్ర ఖుర్ఆన్ లో సారాపై నిషేధం:
                       ఈ క్రింద పేర్కొనబడిన దివ్య ఖుర్ఆన్ ఆయత్  ద్వారా సేవనం గురించి మనల్ని వారించటం జరింగింది . 
                "  ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మద్య పానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అ'న్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అ'జ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్య కరమైన షై'తాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.  "       ( అల్-మాఇ'దహ్  : 90)
2. బైబిల్ లో సారాపై నిషేధం :
                  బైబిల్ లో కూడా సారాను నిషేదితంగా పేర్కొనటం జరిగింది. 
                  "మదిరం పరిహసించేది కలహాన్ని రేపేది  సారా . దీని  వలలో పడినవాడు, శుద్ధ అవివేకి ."                                                                                                                              (సామెతలు :20-1)
                 " సారా మత్తులో మైమరువకండి ."    (ఇఫ్ సియో : 5 - 18) 
3.  సారా మనిషి జ్ఞాపక శక్తిని హరిస్తుంది : 
                  మానవ  మేధస్సులో ఒక అవరోధక కేంద్రం (inhabitory  centre ) ఉంటుంది .చెడు విషయాలుగా అతను భావించే వాటినుండి ఇది అతన్ని ఆపుతూ ఉంటుంది . ఉదాహరణకు ఒక సామాన్య వ్యక్తి, సామాన్య పరిస్థితుల్లో తన తల్లితండ్రులతో, ఇతర పెద్దలతో మాట్లాడుతున్నపుడు, తిట్టడం గని ,లేక ఇతర బూతులు గని పలకడు. 
          అదే విధంగా ఒక వ్యక్తి మలవిసర్జన చ్జేయదలుచుకున్నపుడు, అందరిముందు, బహిరంగంగా అలా చేయకుండా ఈ అవరోధక కేంద్రం (inhabitory  centre )అతన్ని వారిస్తూ ఉంటుంది . అందుకని అతను టాయ్లేట్కు వెళ్తాడు .  
          కాని ఒక వ్యక్తి ఏపుడైతే సారా సేవిస్తాడో , అతని ఈ అవరోధక కేంద్రం   (inhabitory  centre ) నిర్విస్యమై పోతుంది . ఈ కారణంగానే , త్రాగిఉన్న మనిషి హేయమైన పనులు చేస్తూ ఉంటాడు. సామాన్య పరిస్థితుల్లో అతను అలా చేసేవాడు కాదు . సారా మైకంలో మునిగిపోయిన ఒక వ్యక్తి తన తల్లితండ్రుల్ని, పెద్దల్ని నానా రకాలుగా దూశించడం, బూథులు తిట్టడం సామాన్యంగా కనబడుతుంది . కొందరు త్రగుబోతులైతే తమ బట్టల్లో మలముత్ర విసర్జన కూడా చేసుకుంటారు. వారు సరిగా మాట్లాడను లేరు ,నడవను లేరు , కొన్ని సందర్భాల్లోనైతే వారు అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తుంటారు. 
4 . వ్యభిచారం, మానభంగం , వావివరసలు లేకుండా ప్రవర్తించడం , ఎయిడ్స్ లాంటి సంఘటనలు అత్యదికంగా థ్రాగుబోతులు ద్వారానే సంభవిస్తాయి :
                   national   crime victimization survey bureau of justice (U.S.Dept.of justice) ను అనుసరించి ,కేవలం ఒక్క 1996 సంవత్సరం లోనే , ప్రతి రోజు కేవలం బలవంతపు మానభంగాలు 2713 జరిగాయి
బలాత్కార సంఘటనలకు పాల్పడిన వారిలో అత్యధిక మంది సారామైకంలో ఉన్నవారేనని గణాంకాలు తెలియపరుస్తున్నాయి . అమ్మైల్ని వేధించడం వారిలో కూడా అత్యధికులు సారాత్రాగిన వారేనని తెలిసి వచ్చింది .  
                 8 శాతం అమెరికా ప్రజలు, ఇన్ సేస్ట్  బారిన పడిన వారిని తెలుస్తున్నది. అంటే అమెరికా లోని ప్రతి 12 లేక 13 మందిలో ఒకరు ఈ జాడ్యానికి గురి అయిన వారే . ఈ "ఇన్ సేస్ట్"  అనే పదానికి అర్ధ, ఏమిటంటే తల్లి - తండ్రి ,లేక అన్న - చెల్లెలు లాంటి పవిత్ర సంబంధం కలిగిన వారితో సంభోగించటం. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు సామాన్యంగా మద్యం మత్తులో మునిగిపొఇన వారె అధికం . అలాగే ఎయిడ్స్ వ్యాప్తి చెందే కారనాలల్లో ,సారా అతి ముక్యమైన , ప్రధానమైన కారణం . 
5. ప్రతి త్రాగుబోతు ప్రారంభంలో  "కంపనీ కోసమే " ప్రారంబిస్తాడు :         
                      అనేకమంది సారాను సమర్ధిస్తూ , తామైతే డ్రంకర్స్ లమని ,అంటే కంపని కోసం ఒకటి రెండు పెగ్గులు మాత్రమె తీసుకుంటామని , త్రాగిన తరువాత తమ పట్టున , తెలివిని కోల్పోమని, వాదిస్తుంటారు. నేడు త్రగుబోతులుగా మారిన వారంతా కూడా ప్రారంభంలో కంపని కోసమనే , ఒకటి రెండు పెగ్గులు మాత్రమే తీసుకునే వరనేది పరిశీలనలో తేలిపాయింది. సారా త్రాగే వారంతా కూడా,ప్రారంభించేటప్పుడు తాము త్రగుబోతులుగా మరుతామని  నిశ్చయించుకొని ప్రారంభించరు. అప్పుడప్పుడు సారా తిసుకునేవారు ,లేక సోషల్ డ్రంకర్స్, ఏవరైనా సరే , సంవత్సరాల తరబడి తాము సారాను సేవిస్తు ఒక్కసారి కూడా అదుపు తప్పలేదని,తెలివిని కొల్పలేదని బల్లగుద్ది చప్పలేరు.    
6. సారామైకంలో చేసిన ఒక్క తప్పిదం , జీవితాంతం ఒక మచ్చగా మిగిలిపోతుంది :  
                       ఉదాహరణకు ఏవరైనా ఓ వ్యక్తి సారా త్రాగి , తన తెలివిని కోల్పోయడనుకోండి లేక తాగిన మైకంలో అతని ద్వారా బలాత్కారం లేక ఇంకేదైనా నేరo జరిగిపోయిoదనుకోండి, స్ప్రహ వచ్చిన తరువాత అతను తన ఈ చర్యకు సిగ్గుపడిన, పశ్చాతపడినా కూడా,ఒక మంచి స్వభావం గల మనిషి తన ఈ అపరాధ భారాన్ని జివితాంతం మోస్తూనే ఉంటాడు .అతనీ  అకృత్యాన్నిఏన్నాడు మరువలేడు . అంతేకాదు , ఏవరిపట్ల అయితే అతనీ నేరాన్ని చేశాడో ,ఆ వ్యక్తి గాయమూ  మానదు , అతనికి జరిగిన నష్టము పుడ్చాలేనిది. అంటే నేరం చేసినవాని ,నేరానికి బలిఐనవాని -ఇద్దరి జీవితాల్లో ఇదో మాయని మచ్చగా మిగిలిపోతుంది . దిన్ని చరపటం అసంభవం . 
7. ప్రవక్త మహానియులు (స ) కూడా సారాను నిషేధిoచారు:
                            దైవప్రవక్త (స ) ఇలా ఉపదేశించారు:
       (1) " సారా పాపజనని , మరియు అన్ని పాపకార్యాల్లోకేల్లా  ఇది అత్యంత సిగ్గుమాలిన పాపకార్యం ."  (హదీస్ - సునన్ ఇబ్నేమాజ )
      (2)   "ఏ వస్తువు యొక్క అధిక మోతాదు (పరిమాణం ) మైకాన్ని తెస్తుందో , దానియొక్క అల్ప   మోతాదు (పరిమాణం ) కూడా నిషేధితమే."   (హదీస్ - సునన్ ఇబ్నేమాజ)
      (3)  కేవలం సారా సేవించేవారు మాత్రమె చిత్కరించాబడలేదు , (దోషిచాబడలేదు ) త్రగుబోతులతో ప్రత్యేక్షoగాగని,పరోక్షంగాగని సంబంధముండే వారందరూ దైవం దూశించబడినవారే ! (హదీస్ - సునన్ ఇబ్నేమాజ)
                                     ప్రవక్త మహనీయులు (స) ఇలా సెలవిచ్చారని హజ్రత్ అనస్ (రజి) ఉల్లేఖించారు 
                       "సారా (వ్యవహారం) తో ముడివడి ఉన్న పదిమంది దైవదూషణ మరియు దైవదికారని గురిఅవుతారు. ఏవడైతే దాన్ని తయారు చేస్తాడో , ఎవరికొసమైతే ఇది తయరుచేయబడిందో ,దాన్ని సేవిoచేవాడు,దాన్ని చేరవేసే లేక అందించేవాడు ,  ఎవరివద్దకైతే అది చేర్చబడిందో లేక పంపబడిందో ,ఎవడైతే దిన్ని స్వికరిస్తాడో ,ఎవడైతే దిన్ని విక్రయిస్తాడో ,దాని రాబడితో లాభాపడేవాడు , దాన్ని తనకోసమని ఎవడైతే కొన్నడో ,లేక ఇతరుల కోసం ఎవడైతే కొన్నడో  - "వీరంతా దైవ చిత్కారానికి గురవుతారు . (హదీస్ - సునన్ ఇబ్నేమాజ)
8. సారా సేవనం వల్ల వచ్చే కొన్ని వ్యాధులు :
                       సారా నిషేదిoపబడటానికి వైజ్ఞనికపరమైన, భుద్ధిజ్ఞానలకు  అందే కారణాలు కూడా ఉన్నాయి . మరణానికి సంభందించిన అత్యధిక సంఘటనలు ఎలా జరిగాయని విశ్లేషిస్తే, అది సారా వల్ల  అని తేలుతుంది, దీని సేవనం వల్ల  ప్రతి సంవత్సరం లక్షలాది మంది మ్రుత్యుకు హారంలోకి వెళ్ళిపోతున్నారు .సారా సేవనం వల్ల  కలిగే ద్రుష్ప భావాల గురించి అధికంగా చర్చించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ద్రుష్ప భావాలేలా ఉంటాయో , సర్వసామాన్యంగా అందరికి తెలుసు . అయితే సారా త్రాగటం వాళ్ళ కొన్ని వ్యాధులు గురించి సంక్షిప్తంగా పెర్కుoటూన్నాము:
                      1. సారా సేవనం వల్ల  వచ్చే వ్యాదుల్లో  కాలేయo శుశ్కిన్చిపోయే వ్యాధీ  ( cirrhosis of lever ) అన్నిటిలో  ప్రముఖమైనది ,ఇది చాల ప్రమాదకరం . 
                      2. ఆహార నాలపు క్యాన్సేర్ (cancer  of  oesophagy ) శిరస్సు ,మెడ ,కాలేయం మరియు ప్రేవులకు వచ్చే క్యాన్సేర్ .
                      3.ఆహర నాళపు వాపు (Oesophagitis) జీర్ణకోశపు వాపు (Gastritis) పిత్తకోశపు వాపు (Panreatitis) మరియు హెపటైటిస్ (Hepatitis) మొదలగు వ్యాధులన్ని సారా సేవనం వల్ల వస్తాయి. 
                      4.కార్డియోమయోపేది (Cardiomyopathy), తీవ్రమైన రక్తపోటు (Hypertension), కారొనరీ ఆర్థిరోస్కెలోరాసిస్ (Coronary Artheroscleresis), అంజైనా (Angina) మరియు గుండెపోటు కూడా ఆత్యధికంగా సారా సేవనంతోనే సంబంధం కలిగి ఉంటాయ్. 
                       13. సాక్షుల మధ్య సమానత్వం  
                       ప్రశ్న: సాక్ష్యం విషయంలో ఇద్దరు స్త్రీలు ఒక పురుషునితో సమానం ఎందుకు?
                       జవాబు: ఇద్దరు స్త్రీల సాక్షం, ఒక పురుషుని సాక్షంతో సమానమనేది ప్రతి విషయంలో కాదు. ఇది కొన్ని ప్రత్యెక సందర్భాల్లోనే వర్తిస్తుంది. దివ్య ఖుర్ఆన్ లో, సాక్షాన్ని  సంబంధించి, స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి అంతరం లేక భేదం చూపకుండా వర్ణించిన కనీసం మూడు ఆయత్ లు వచ్చాయి. ఖుర్ఆన్ లోని 282వ ఆయత్- ఇది ఖుర్ఆన్ లోని అన్నిటికన్నా సుదీర్ఘ ఆయత్- లో ఆర్ధికం మరియు వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఆ ఆయత్ యొక్క అనువాదం ఇలా ఉంది.: 
                            ఓ విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీతకాలం కొరకు అప్పు తీసుకున్న ప్పుడు, దానిని వ్రాసిపెట్టుకోండి. మరియు మీలో పత్రం వ్రాసేవాడు, న్యాయంగా వ్రాయాలి. మరియు వ్రాసేవాడు నిరాకరించ కుండా, అల్లాహ్‌ నేర్పి నట్లు వ్రాయాలి. ఋణగ్రహీత అల్లాహ్‌కు భయపడి, నిర్ణీత షరతులను తగ్గించ కుండా, చెప్పి వ్రాయించాలి. ఋణగ్రహీత అల్పజ్ఞాని లేక సామర్థ్యం లేనివాడు లేక బలహీనుడు మరియు తాను చెప్పి వ్రాయించలేని వాడైతే, అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మరియు మీలో ఇద్దరు మగ వారిని సాక్ష్యమివ్వటానికి సాక్షులుగా ఉంచుకోండి. ఇద్దరు పురుషులు దొరకని పక్షమున ఒక పురుషుడు మరియు మీకు సమ్మతమైన ఇద్దరు స్త్రీలను సాక్షులుగా తీసుకోండి. (ఎందుకంటే) వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేయించవచ్చు. మరియు పిలువబడినప్పుడు సాక్షులు, సాక్ష్యమివ్వటానికి నిరాకరించ కూడదు. మరియు వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో పాటు వ్రాసిపెట్ట టానికి అశ్రధ్ధ చూపకూడదు. అల్లాహ్‌ దృష్టిలో ఇది న్యాయ సమ్మతమైనది మరియు స్థిరమైన సాక్ష్యంగా తోడ్పడు తుంది మరియు ఏ విధమైన సందేహాలకు అవకాశం లేకుండా చేస్తుంది. కాని, మీరు అప్పటికప్పుడు ఇచ్చి పుచ్చుకునే (సాధారణ) లావాదేవీలు చేస్తున్నపుడు వ్రాయకున్నా దోషంలేదు. కాని, వ్యాపార వ్యవహారాలు నిర్ణంచేటప్పుడు సాక్షులను పెట్టుకోండి. కాని వ్రాసేవానికి గానీ, సాక్షులకు గానీ ఏ విధమైన హాని జరుగ కూడదు. ఒకవేళ అలా జరిగితే! నిశ్చయంగా, అది మీకు పాపం. మరియు అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఇది అల్లాహ్‌ మీకు నేర్పుతున్నాడు. మరియు అల్లాహ్‌కు ప్రతిదాని జ్ఞానం ఉంది.
(ఖుర్ఆన్  2వ సూర బఖర 282 వ వాక్యం ) 
                         ఫై ఆయత్ ఆర్ధికపరమైన మరియు క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మార్గదర్శకం వహిస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో ఇరుపక్షాల మధ్య ఏదైతే బడంబడిక జరిగిందో, దాన్ని వ్రాతపూర్వకంగా పదిలపరుచుకోవాలని మరియు దానికి ఇద్దరు సాక్షలను పెట్టుకోవాలని ఆదేశించటం జరిగింది. ఒకవేళ సమయానికి ఇద్దరు పురుషులు లభించకపోతే, ఒక పురుషుడు మరియు ఇద్దరు స్రీలు సరిపోతారు. 
                       ఉదాహరణకు: ఎవరైనా ఓ వ్యక్తీ ఒక ప్రత్యేక వ్యాధిలో శాత్ర చికిస్త్స(operation ) చేయిన్చుకోదలిచినప్పుడు వ్యాది వాస్త వికతను, తీవ్రతను, మరియు చికిత్సకు సంబంధించి ప్రధానంగా నిపుణులు, యోగ్యులైన ఇద్దరు డాక్టర్ల సలహాను తప్పకుండా తీసుకుంటాడు . ఓక వేల అతనికి నిపుణులు యోగ్యులు ఐన ఇద్దరు సర్జనులు దొరకలేదని అనుకోండి, అప్పుడు అతను లభించిన ఒక సర్జన్ మరియు మామూలు M.B.B.S డిగ్రీ ఉన్న ఇద్దరు డాక్టర్ లనైన  సంప్రదిస్తాడు. ఎందుకంటే సముచిత సలహా ఇవ్వటానికి శాస్త్ర చికిత్సను అనుభావజ్జుడైన రెండోవ సర్జన్ లబించానప్పుడు అతనికి మిగిలే మార్గం ఇది ఒక్కటే. 
                      ఇదే ప్రకారంగా ఆర్ధికపరమైన మరియు వ్యాపార సంభంద వ్యవహారాల్లో పురుషులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇస్లాం ఒక పురుషుడిని తన కుటుంబికుల ఆర్ధిక అవసరాలను తీర్చే బాధ్యుని రూపంలో చూస్తుంది. ఆర్ధిక బారాన్ని చూసే బాధ్యతా పురుషులపై ఉంటుంది. కనుక వారు వ్యాపార వ్యవహారల్లో  స్త్రీల కన్నా అధిక యోగ్యులు, సమర్దులు మరియు అనబవజ్జులై ఉంటారని ఇస్లాం ఆశిస్తుంది. ఇది వీలు పడక పొతే, ప్రత్యామ్నాయంగా ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలను నియమించుకొండంతుంది. దీనికి కారణం ఏమిటంటే ఒక స్త్రీ పొరపాటు చేస్తే, రెండోవ స్త్రీ దాన్ని సరిదిద్దగలగుతుంది. అరబ్బీలో దీని కోసం "తజిల్" అనే పదం వాడబడింది. దీని అర్ధం మానసిక ఉల్లంఘన లేదా పొరబడటం. కొందరు దీని అనువాదం మరిచిపోవటం అని చేసారు, అది తప్పు. ఈవిధంగా, కేవలం ఆర్ధిక పరమైన మరియు వ్యాపార సంభందమైన వ్యవహారాల్లో మాత్రమె, ఇద్దరు స్త్రీల సాక్షం ఒక పురుషునికి సమానం అని తెలుపటం జరిగింది. 
                     కొందరు ఇస్లామియా విద్వాంసుల ననుసరించి హాత్యా వ్యవహారంలో కూడా స్త్రీల మనస్తత్వం లేక ప్రవర్తన సాక్షాన్ని  ప్రభావితం చేసేదిగా ఉంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో స్త్రీలు, పురుషులకన్న సునితంగాను మరియు అధికంగా బయభితులు చెందే అవకాశము ఉంటుంది. తమ ఈ మనస్తత్వం వాళ్ళ వారు కలవరపాటుకు ఆందోళనకు కన్ఫ్యూషన్ కు గురి ఆయ్యె అవకాశం ఎంతైనా ఉంటుంది. అందుకని కొంత మంది ధార్మికవేత్తను హత్య విషయంలో కూడా ఇద్దరు స్త్రీల సాక్షాని ఒక పురుషుని సాక్ష్యంతో  సమానంగా భావించారు. ఇది తప్ప ఇక మిగిలిన అన్ని వ్యవహారాల్లో ఒక స్త్రీ సాక్ష్యం, ఒక పురుషిని సాక్ష్యానికి సమానంగా గుర్తించబడుతుంది.  
                     దివ్య ఖుర్ఆన్ లో సాక్ష్యనికి సంభందించిన ఐదు ఆయత్ లున్నాయి. ఐతే దేంట్లో కూడా స్త్రీలేక పురుషుడు అని పెర్కొనబడలేదు ఆస్తి పంపకానికి సంభందించిన కాగితాలపై సాక్షులుగా ఇద్దరు న్యాయ ప్రముఖులైన వ్యక్తుల అవసరం ఉంటుంది. ఈ విషయంలో దివ్య ఖుర్ఆన్ లో ఇలా చెప్పబడింది:
                          ఓ విశ్వాసులారా! మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైతే, మీరు వీలునామా వ్రాసేటప్పుడు, మీలో న్యాయ వర్తులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా తీసుకోండి. ఒకవేళ మీరు ప్రయాణస్థితిలో ఉండి, అక్కడ మీకు మరణ ఆపద సంభవిస్తే, మీ వారు (ముస్లింలు లేకుంటే) ఇతరులను ఎవరినైనా ఇద్దరిని (సాక్షులుగా) తీసుకోవచ్చు. ఆ ఇద్దరినీ నమా'జ్ తరువాత ఆపుకోండి. మీకు సందేహముంటే, వారిద్దరూ అల్లాహ్పై ప్రమాణం చేసి ఇలా అనాలి: ''మా దగ్గరి బంధువు కొరకైనా సరే మేము స్వార్థం కొరకు మా సాక్ష్యాన్ని అమ్మము. మేము అల్లాహ్కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచము. మేము ఆవిధంగా చేస్తే నిశ్చయంగా, పాపాత్ములలో లెక్కింప బడుదుము గాక!'' 
(ఖుర్ఆన్  5వ సూర అల్-మాఇ'దహ్ 106 వ వాక్యం )
                       మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనిందమోపిన తరువాత నలుగురు సాక్షులను తీసుకొనిరాలేరో, వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటి వారు పరమ దుష్టులు .
 (ఖుర్ఆన్  24వ సూర అన్-నూర్ 4 వ వాక్యం )
                        ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషిని సాక్ష్యానికి సమానమనే నియమం అన్ని విషయాలను వ్యవహారాలకు వర్తిస్థుoదని కొందరు ఇస్లామియాతత్వవేత్తలు చెబుతారు. కాని ఈ అభిప్రాయంతో ఎకిభవించటం ఎట్టి  పరిస్తితిలలోను సంభవం కాదు ఎందుకటే దివ్య ఖుర్ఆన్ లోని సూర అన్-నూర్ లోని 8వ ఆయత్ ఒక పురుషిని సాక్ష్యం, ఒక స్త్రీ సాక్ష్యం సమానమని స్పష్టంగా పేర్కొంటున్నది. 
                        ఇక ఆమె (భార్య) శిక్షను తప్పించుకోవ టానికి, నాలుగు సార్లు అల్లాహ్‌పై ప్రమాణం చేస్తూ: నిశ్చయంగా, అతడు అబద్ధం చెబుతున్నాడనీ; 
 (ఖుర్ఆన్  24వ సూర అన్-నూర్ 8 వ వాక్యం )
                        హదీస్ స్వీకరనలు హజ్రత్ ఆయేషా(ర.జి) కనీసం 2220 హదిసుల్ని ఉల్లేకించారు, వాటిని హజ్రత్ ఆయేషా(ర.జి) ఒక్కరి సాక్ష్యం మీదనే ప్రామాణికమైనవిగ గుర్తించటం జరింది. 
                           నెలవంకను చూసే సందర్బంలో ఒక స్త్రీ సాక్ష్యం సరి పోతుందని పలువురు ధార్మిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు. కాస్త ఆలోచించండి. ఇస్లామియా మూలా స్తంభాల్లో ఒకటైన ఉపవాస వ్రతం ప్రారంభించటం మరియు ముగించటం లాంటి అతి ముక్య సన్నివేశంలో ఒక ఒంటరి  స్త్రీ సాక్ష్యం స్వీకరించబడుతుంది. అంటే ఒక స్త్రీ సాక్షం మీద సర్వ ముస్లిం సమాజం ఉపవాసం ప్రారంభిస్తున్దన్నమాట. ఐతే కొందరు ఇస్లామియాతత్వవేత్తలు, రంజాన్ ఉపవాసాలు ప్రారంభించే సమయంలో ఒక స్త్రీ సాక్ష్యమైన చాలని, కాని ఉపవాసాలు సమాప్తం చేసే సమయంలో మాత్రం ఇద్దరు సాక్ష్యం అవసరమని పేర్కొంటారు. కాని ఈ ఇద్దరి సాక్ష్యంలో ఆడ మొగ అనే తారతంన్యం లేదు. కొన్ని సందర్భాల్లోనైతే కేవలం స్త్రీ సాక్ష్యమే అవసరమే అవుతుంది. అటువంటి సందర్భాలో పురుషుడిచ్చే సాక్ష్యం స్వీకరించబడదు. ఉదాహరణకు: స్త్రీలకూ సంభందించిన ప్రత్యెక విషయాల్లో, స్త్రీ శవానికి స్నానం చేయించేటప్పుడు కేవలం స్త్రీ సాక్ష్యమే పరిగణలోకి తీసుకోబడుతుంది. 
                            మొత్తం మీద  తెలిసే దేమిటంటే ఆర్ధిక పరమైన లావాదేవిల్లో స్త్రీ, పురుష సాక్ష్యాల మద్య ఉన్న వ్యత్యాసం వారి లింగ భేదాన్ని బట్టి చూపే వ్యత్యాసం కాదు. ఈ వ్యత్యాసం కేవలం వారి వారి  స్వభావాన్ని నైజాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమె చూపబడుతుంది. దిని వాళ్ళ ఇస్లాం, సమాజంలో స్త్రీ- పురుషుల విధులు, బాద్యతల విషయంలో కూడా స్పష్టమైన, నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి ఉందన్న విషయం అర్ధమవుతుంది. 

 14. వారసత్వం 
ప్రశ్న : ఇస్లామియ చట్టాన్ని అనుసరించి, వారసత్వపు ఆస్తిలో స్త్రీ భాగం, పురుషుని భాగంలో సగం ఎందుకని?
   జవాబు :
1.  దివ్య ఖుర్ ఆన్ లో వారసత్వ ప్రస్తావన :
                   దివ్య   ఖుర్ ఆన్ లో వారసుల మధ్య ఆస్థి  పంపకానికి సంబంధించి వివరమైన ఆదేశాలు, ఈ క్రింది పేర్కొన్న సురాలలోని వివిధ అయాత్ లలో ఉన్నాయి :
                  బఖర : 180,240;  నిసా : 7-9,19,23;  అల్ మాయిద :106-108.  
                మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్ మీకు ఈవిధంగా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని (భాగం) ఇద్దరు స్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి. ఒకవేళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ స్త్రీ (సంతానం మాత్రమే) ఉంటే, వారికి విడిచినఆస్తిలో మూడింట రెండు భాగాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధభాగానికి ఆమె హక్కు దారురాలు. మరియు (మృతుడు) సంతా నం కలవాడైతే, అతని తల్లిదండ్రులో ప్రతి ఒక్కరికీ విడిచిన ఆస్తిలో ఆరోభాగం లభిస్తుంది. ఒకవేళ అతనికి సంతానంలేకుంటే అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే, అప్పుడు తల్లికి మూడోభాగం. మృతునికి సోదర సోదరీమణులు ఉంటే, తల్లికి ఆరోభాగం. (ఈ పంపకమంతా) మృతుని అప్పులు తీర్చి, అతని వీలునామా పై అమలుజరిపిన తరువాతనే జరగాలి. మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనంరీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్ని హితులో, మీకు తెలియదు. ఇది అల్లాహ్ నియమించిన విధానం. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.    
                   మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధ భాగం. కాని ఒకవేళ వారికి సంతానం ఉంటే, వారు విడిచిపోయిన దానిలో నాలుగోభాగం మీది. (ఇదంతా) వారు వ్రాసి పోయిన వీలునామాపై అమలుజరిపి, వారి అప్పులు తీర్చిన తరువాత. మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచి పోయినదానిలో వారికి (మీభార్యలకు) నాలు గోభాగం. కాని ఒకవేళ మీకు సంతానం ఉంటే, మీరు విడిచినదానిలో వారికి ఎనిమిదో భాగం. ఇదంతా మీరు వ్రాసిన వీలునామాపై అమలుజరిగి, మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాలఅయి (తండ్రి, కొడుకు లేక మనమడు లేకుండా) ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే, వారిలో ప్రతి ఒక్కరికీ ఆరోభాగం. కాని ఒకవేళ వారు (సోదర-సోదరీమణులు) ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే, వారంతా మూడో భాగా నికి వారసులవుతారు. ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలుజరిగి అప్పులు తీర్చిన తరువాత, ఎవ్వరికీ నష్టం కలుగజేయ కుండా జరగాలి. ఇది అల్లాహ్ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు (శాంత స్వభావుడు). 
                                                                                                                          (అన్-నిసా : 11,12) 
                    ప్రవక్త!  ప్రజలు  నిన్ను, (కలాలను) గురించి ధార్మిక శాసనం (ఫత్వా) అడుగుతున్నారు. అల్లాహ్ మీకు, కలాలను గురించి, ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు: ''ఒక పురుషుడు మరణించి, అతనికి సంతానం లేకుండా ఒక సోదరి మాత్రమే ఉంటే, అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగం వాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి, అతడు (ఆమె నిజ సోదరుడు) వారసు డవుతాడు. అతనికి (మృతునికి) ఇద్దరు సోదరీ మణులు ఉంటే, వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో మూడింట రెండు వంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు (అనేకు లుంటే) ప్రతి పురుషునికి ఇద్దరు స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు. మరియు అల్లాహ్కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.''          
                                                                                                                            (అన్-నిసా : 176)
                  అత్యధిక సందర్బాల్లో , స్త్రీలకు పురుషుల్లోని సగభాగం లభిస్తుంది. అయితే ఎల్లప్పుడు ఇలాగే జరగదు. ఒకవేళ మృతుని బంధువుల్లోని (అనగా తండ్రి తాతలు, కుమారులు, మనుమలు) వారసులు ఎవరూ  లేకుంటే, కాని కుమారుడు సోదర సోదరిలు ఉండివుంటే, అందులోని ప్రతి వారసునికి ఆరవ భాగం లభిస్తుంది. ఒకవేళ మృతునికి సంతానమే గనక ఉంటె, అతని తల్లి - తండ్రి  ఇద్దరికీ సమాన భాగం లభిస్తుంది.  అనగా ఆస్తిలోని ఆరవ భాగం. కొన్ని సందర్భాల్లో స్త్రీలకు , పురుషులకన్న  రెండింతల ఆస్తి లబిస్తుంది. ఒకవేళ చనిపొయినది స్త్రీ అయిఉంటె, ఆమెకు ఎలాంటి సంతానం లేకపోతే, మరియు సోదరుడు , సోదరీ  కూడా లేకపోతే , కేవలం భర్త, తల్లి మరియు తండ్రి మాత్రమే ఉంటె , అటువంటి సందర్భాల్లో భర్తకు ఆమె ఆస్తి మొత్తం నుండి సగభాగం, తల్లికి మూడవ వంతు , తండ్రికి ఆరవ వంతు భాగం లభిస్తుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో తల్లికి, తండ్రి కన్నా రెండింతల ఎక్కువ భాగం లభిస్తుంది. వారసత్వ చట్టాన్ని అనుసరించి, సర్వసామాన్య పరిస్థితుల్లో, పురుషులకు లభించిన వాటాలో స్త్రీలకు సగభాగమే లబిస్తున్దనేది నిజమే . ఉండహరణకు ఈ క్రింది పేర్కొనబడిన సందర్బాలలో :
   (1) కూతురుకు, కుమారునికి లభించిన వాటాలో సగభాగమే లభిస్తుoది . 
   (2) మృతునికి సంతానం లేనప్పుడు, భార్యకు ఎనిమిదవ భాగం లభిస్తే, భర్తకు నాలుగవ భాగం లభిస్తుంది.   
   (3) మృతునికి సంతానం ఉన్నప్పుడు, భార్యాకు నాలుగవ భాగం లభిస్తే భర్తకు సగభాగం లభిస్తుంది. 
   (4) మృతునికి పై వారసులుగాని (తండ్రి తాతలు ) క్రింది వారసులు (కుమారులు, మనుమలు ) లేనప్పుడు, సోదరునికి లభించిన వాటాలో సోదరికి సగభాగం లభిస్తుంది. 
            కుటుంబ ఆర్ధిక అవసరాలు తీర్చే బాధ్యత పురుషునిపై ఉంటుంది. కనుక అతనికి వారసత్వంలో                                                            రెండింతల భాగం లభిస్తుంది. 
       ఇస్లామియ ధర్మంలో స్త్రీలపై కుటుంబ ఆర్ధిక అవసరాలు తీర్చే భాద్యత లేదు. ఈ భాద్యత పురుషులపై మోపబడుతుంది. వివాహానికి ముందు ఒక స్త్రీ ఆర్ధిక అవసరాలు అనగా తిండి, బట్ట మున్నగు అవసరాలు తీర్చే భాద్యత ఆమె తండ్రి మరియు సోదరునిపై ఉంటుంది. వివాహానంతరం ఈ భాద్యత ఆమె భర్త లేక కుమారునిపై ఉంటుంది. కుంటుంబ ఆర్ధిక అవసరాలు తీర్చే భాద్యత, ఇస్లాం పురుషునిపై మోపుతుంది. ఈ విధంగా పురుషునిపై ద్విగుణీకృత భాద్యత ఉంటుంది, అందుకనే అతనికి రెండింతల వాటా లభిస్తుంది. ఎవరైనా ఓ వ్యక్తి చనిపోయేటప్పుడు తన పిల్లల కోసం ( ఒక కుమారుడు, ఒక కుమార్తె ) లక్షన్నర రూపాయలు విడిచి వేల్లడనుకోండి. అటువంటి సందర్భంలో కుమారునికి లక్ష రూపాయలు మరియు కుమార్తెకు యాభై వేలు లభిస్తాయి . బాహ్యంగా, పైపై దృష్టితో చూస్తే, కుమారునికి లభించిన వాటా అధికమనిపిస్తుంది. కానీ లోతుగా పరిశీలిస్తే తేలేదేమిటంటే, అతనికి లభించిన లక్ష రూపాయిల్లొ( బహుశ ) ఎనభై వేలు అతను తన ఇంటి ఆర్ధిక అవసరాలు తీర్చటంలోనే  ఖర్చు చేసేస్తాడు. ఇక అతని పాలుకు మిగిలేది కేవలం ఇరవై వేలే. ఇక రెండవ వైపు స్త్రీకి (కూతురుకు ) లభించిన యాభై వేల రూపాయల్లొ, ఒక రూపాయి కూడా ఇతరుల పై ఖర్చుపెట్టే భాద్యత ఆమెపై లేదు. ఆమె తన వాటా పూర్థి ధనాన్ని హన వద్ద  ఉంచుకోవచ్చు. ఈ రెండు స్థితుల్లో మీరు దేనికి ఇష్టపడతారు ? లక్ష రూపాయిలు పొంది, ఎనభై వేలు మిగిలే పరిస్థితి లాభాదాయకమా? లేక యాభై వేలే పొంది, ఆ మొత్తం యాభై వేలు తన వద్దనే ఉంచుకునే స్థితి లాభాదాయకమా ?   
15. పరలోకం - మరణానంతర జీవితం 
     ప్రశ్న : పరలోకం అంటే మరణానంతరo ఒక జీవితం ఉందని మీరెలా నిరూపిస్తారు ?
     జవాబు : పరలోకంపై విశ్వాసం :
                                     ఒక వైజ్ఞానిక మరియు హేతువాద (తార్కిక) మనస్తత్వం కలిగిన వ్యక్తి మరణాంతరం ఒక జీవితముందనే విషయాన్నీ ఎలా విశ్వసించగలడని కొంతమంది ఆశర్యపోతారు. అంధ, మూఢ విశ్వాసాల్లో ఇరుక్కుపోవటం వల్లనే, మనషిలో పరలోక జీవితంపై విశ్వాసం ఏర్పడుతుందని వారు భావిస్తుంటారు. కాని ఇది నిజం కాదు. వాస్తవంలో పరలోక జీవితంపై విశ్వాసమనేది తార్కికమైనది. హెతుబద్ధమైనది. బుద్ధిజ్ఞానాలా దృష్ట్యా, సముచితమూ, సమంజసమైనది. 

2. పరలోకం - సైద్ధాంతిక విశ్వాసం:
                      దివ్య ఖుర్ఆన్ లోని వేయికి పైగా ఆయాత్ లలో, శాస్త్రీయ యుదార్ధలను, (లేక వాస్తవాలను) వివరించటం జరిగింది. (దీనికోసం Quran  అండ్ సైన్స్ కంపెటిబాల్ ఓర ఇంకంపెటిబల్ అనే పేరుతొ వెలుబడిన నా పుస్తకాన్ని చూడవచ్చు). గడిచిన కొన్ని శతాబ్దాల్లో ఖుర్ఆన్ లో వివరించిన అనేక వాస్తవాలను కనుగోనడం జరిగింది. అయితే ఖుర్ఆన్ లో వివరించిన అన్ని విషయాల్ని ధ్రువికరించెoత స్ధాయికి సైన్స్ ఎదగలేదు. 
                               ఉదాహరణకు దివ్య ఖుర్ఆన్ లో వివరించిన విషయాల్లో నేటివరకు 80 శాతం విషయాలపై పరిశోధన జరుగగా, అందులో నూటికి నూరు శాతం వాస్తవమని తేలాయి. మిగిలిన ఇరవైశాతం విషయాల్లో సైన్స్ ఇంకా ఖచ్చితమైన, నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేకపోయింది. దీనికి కారణం ఏమిటంటే ఖుర్ఆన్ వివరించిన విషయాలు వాస్తవమా? కాదా? అని ఖచ్చితమైన నిర్ణయానికి రాగాలిగెంత స్ధాయికి సైన్స్ ఇంకా ఎదగలేదు. మనకు లభించిన పరిమిత జ్ఞానం ఆధారంగా, ఖుర్ఆన్ వచ్చిన విషయాల్లో ఒక్క శాతం కూడా తప్పు లేక పొరపాటు అని మనం విష్వసనియంగా పెర్కోనేస్దితిలో లేము. అయితే ఇక్కడ మనం గమనిoచవలసిన విషయం ఏమిటంటే వందలో, ఏనభై శాతం విషయాలు నిజం, వాస్తవాలే అని ద్రువికరిమ్పబడినప్పుడు, మిగిలిన 20 శాతం విషయాలు కూడా వాస్తవాలే అని విశ్వసించటం తార్కికం, సహేతుకం అనబడుతుంది.
 3. పరలోకంపై విశ్వాసం లేకుండా, శాంతి, మానవీయ విలువల గురించి ఆలొచించనైనా లేము:
                 దొంగతనం, దోపిడీ మంచిదా? చెడ్డదా? అని ఒక సామాన్యవ్యక్తిని ప్రశ్నించినా కూడా, ఇది చెడు అనే ఆటను సమాధానమిస్తాడు. కాని అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఎవరైతే పరలోకాన్ని విశ్వసిo చాడో, అలాంటి వ్యక్తీ, అత్యంత శక్తిమంతుడు, పలుకుబడి గలనేరస్తుల్ని దొంగతనం, దోపిడీ చెడ్డదని ఎలా ఒప్పించగలడు? ఉదాహరణకు నేను ప్రపంచంలోనే అతిపెద్ద గజదొంగను, నెరస్ధున్ని, దీనితోపాటు నేను అత్యంత తెలివితేటలూ గల హెతువాదిని కూడను. దోపిడీ వల్ల కొద్ది సమయంలోనే అపార ధనరాసుల్ని కుదబెట్టుకొని విలాసవంతమైన జీవితం గడపవచ్చని, అందుకని దోపిడీ మంచిపద్ధతని నేను వాదిస్తాను.          
                                  ఎవరైనా ఓ వ్యక్తీ అది చెడ్డదని నన్ను సహేతుకంగా ఒప్పించగలిగితే, దాన్నుండి నేను ఆగిపోతాను. ఆ దుర్వర్తనం నుండి ఆగిపోవటానికి కొందరు సామాన్యంగా ఈ క్రింద దృష్టాంతాలను ఇస్తారు. 

(1) నష్టానికి గురైనవాడు కష్టాల్లో పడిపోతాడు: 
                                  దోచుకోబడిన వ్యక్తీ తీవ్ర కష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, అతను అమితంగా బాధపదతాడని, అందుకని దోపిడీ చెడ్డదని కొందరు చెబుతారు. నిజమె. దోపిడీకి గురిఅయిన వ్యక్తీ తన కష్టార్జితాన్ని కోల్పోతాడు. అనేక కష్టనష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనేది కూడా వాస్తవమే. అయితే నాకేంటి? నాకు మాత్రం ఈ పనివల్ల అవలీలగా డబ్బొస్తుంది. దీనితో నేను విలాసవంతమైన జీవితాన్ని గడపగాలుగుతున్నాను. ఇతరులకు ఏదైతే నాకేంటి? అని నేను నోరు ముయించగలను. 

(2) వేరొకరు కూడా మిమ్ముల్ని దోచుకోవచ్చు: 
                                  ఏదో ఒక రోజు వేరొకరు కూడా మిమ్ముల్ని దొచుకొవచ్చుకదా? అని కొందరు ప్రశ్నించవచ్చు. కాని నాపట్ల అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే, నేను అత్యంత పలుకుబడి, శక్తిసామర్ధ్యాలు కలిగిన ఘరానా దొంగను. ఎంతోమంది బాదిగార్డ్ లు నా వెంట ఉంటారు. నేను ఒకరిని దోచుకోగలను గాని మరొకరు నన్ను దోచుకోలేరు. దోపిడీ అనేది ఒక సామాన్య మనిషికే ప్రమాదకరం. కాని నాలాంటి శక్తిమంతునికి, పలుకుబడి గలవానికి ప్రమాదకరమైనది ఎంతమాత్రం కాదు. 

(3) పోలీసులు మిమ్మల్ని పట్టుకోవచ్చు: 
                             ఏదో ఒక రోజు, మీరు పోలీసులకు పట్టుబడే అవకాశముంటుందని కొందరు చెబుతారు కాని పోలీసులు పట్టుకోవడమా! అది అసంభవం.కానిస్టేబుల్ లాంటి చిన్నపాటి ఉద్యోగి నుండి కమిషనర్ వరకు, ఇంకా మాట్లాడితే ప్రభుత్వంలోని మంత్రులు వరకు నా చెప్పుచేతుల్లో ఉంటారు. వారిని నేను సాకుతున్నాను. నేనిచ్చే మామూల్ల మీద వారు బ్రతుకుతున్నారు. మామూలు మనిషి దొంగతనాలు చేస్తుంటే అతను పట్టుబదతాడని, దోపిడీ దొంగతనమనేది అతనికి ప్రమాదకరమైనదిగా, చేద్దదిగానే నేను అoగికరిస్తాను. కాని నేను మామూలు మనిషి కాదె! అత్యంత శక్తిసామర్ధ్యాలు, పలుకుబడి, రాజకీయ అండదండలు ఉన్న ఘరానా నేరస్తుణ్ణి. నాలాంటి ఉన్నత శ్రేణికి చెందిన నేరస్తుణ్ణి అసలెవరూ పట్టుకోలేరు.  
                            దోపిడీ చెడ్డదని సహేతుకంగా నిరూపించండి, నేను దొంగతనపు వృత్తిని విదిచి పెడ్తాను . 

(4) ఇది కష్టపడకుండా సంపాదించిన అక్రమ సంపాదన: 
                          ఇది కష్టపడకుండా సంపాదించిన, లేక తక్కువ శ్రమతో సంపాదించిన అక్రమ సంపాదన అని కొందరు వాదిస్తారు. నిజమే. దొంగతనం వళ్ళ, దోపిడీ ద్వారా కొంచెం కష్టపడితే చాలు, బోలెడు సంపాదన వస్తుంది నెనూ అంగీకరిస్తాను. అందుకేగా దోపిడీ, దొంగతనాల వృత్తిని అవలంబించింది. బోలెడంత డబ్బు సంపాదించే సులభమైన, సౌలభ్యమ్తొ కూడిన ఒక మార్గం ఉన్నప్పుడు, కష్టంతోకూడిన, తక్కువ హేతవాది అయిన ప్రతి వ్యక్తీ మొదట మార్గాన్నే అంటే తక్కువ శ్రమతో, సులభంగా బోలెడు డబ్బు వచ్చే మార్గాన్నే అవలంబిస్తాడు. 

(5) ఈ వృత్తి మానవత్వానికే మాయని మచ్చ: 
                             దొంగవృత్తి అనేది మానవత్వానికే మచ్చ అని, అది మానవీయ విలువలకే విరుద్దుమని, అందుకని ప్రతి వృత్తి, ఇతర మనషుల గురించి తప్పక ఆలోచించాలని కొందరoటారు. దీన్ని ఖండిస్తూ నేననేదేమిటంటే, మానవత్వం అనే ఈ చట్టాన్ని, నియమాన్ని రూపొందించిన వారెవరు? ఒకరు, ఒక చట్టాన్ని, నియమాన్ని రూపొందిస్తే, నేనెందుకు దానికి కట్టుబడి ఉండాలి. దానివల్ల నాకేం లాభం? నేను హేతువాదిని, నా లాభం, నా ప్రయోజనం దేంట్లో ఉందొ, నేనదే చేస్తాను. ఇతరుల గురించి నేనెందుకు ఆలోచించాలి. వారి లాభానష్టాలతో నాకేం పని? నా లాభమే నాకు ప్రియం. అదే నేను చూసుకుంటాను. 

(6) ఇది ఒక స్వార్ధపూరిత కార్యం : 
                    ఇది స్వార్ధపూరిత పనిగా కొందరు పేర్కొనవచ్చు. అది వాస్తవమే. దొంగతనం దోపిడిలు చేయటం పూర్తిగా స్వార్ధపూరితమే, అని అన్గికరించటంలో నాకే అభ్యంతరం లేదు. నేను స్వార్ధపరున్ని అనటం కూడా సమంజసమే. అయితే ఈ పని వల్ల నేను ఆనందపూర్వకమైన, విలాసవంతమైన జీవితం గడపగలుగుతున్నాను. 

(7) దొంగతనం చెడు అనడానికి సైద్ధాంతిక ఆధారం లేదు: 
                         దోపిడీని చెడు కార్యంగా నిరూపించటానికి మీరిచ్చే దృష్టాంతాలు, తర్కం అన్ని నిష్ప్రయోజనమైనవి. ఇలాంటి తర్కంతో, మీరు మామూలు దొంగల్ని, చిన్నపాటి దోపిడిదార్లను ఒప్పించగలిగితే  ఒప్పించగలరేమో, బెదరించగలరేమో కాని, నాలాంటి ఘరానా, శక్తిసామర్ధాలు, పలుకుబడి గల వ్యక్తిని కట్టడి చేయలేరు. మీరిచ్చే దృష్టాంతాలు, ఏవి కూడా తీర్కికంగా, హేతువాదం ముందు నిలబడజాలవు. ఈ ప్రపంచం అపరాధులతొ నిండి ఉందనే విషయం కూడా ఆశ్చర్యకరమేమి కాదు. 
                            మోసం, వంచన, అత్యాచారం లాంటి వ్యవహారాలు కూడా ఇలాంటివి. శక్తిశాలి మరియు ప్రభావవంతుడైన ఏ అపరాధిని ఏ తార్కిక ప్రమాణం ద్వారా కూడా ఇవి చెడు విషయాలైనట్లు మీరు సంతృప్తిపరచలేరు, ఏ హేతువాదం ద్వారా కూడా మీరతన్ని ఒప్పించలేరు. 

(8) ఎంతటి అపరాదినైన ఒక ముస్లిం మొప్పించగలడు: 
                        ఇకిప్పుడు, ఈ విషయానికి సంబంధించి ఇంకొక దృష్టికోణంతో చర్చిద్దాం. ఉదాహరణకు మీరు ప్రపంచంలోనే అత్యంత శక్తిశాలి మరియు పలుకుబడిగల అపరాదులనుకోండి. మీ రక్షణకు మామూలు కానిష్టేబుల్ మొదలుకొని మంత్రులు వరకున్నారు. మీ రక్షణ కోసం, మీ మీద ఈగవాలకుండా అహర్నిశలు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండటానికి ఒక సైన్యానికి సైన్యమే ఉంది. నేనొక ముస్లింను. దొంగతనం, దోపిడీ, మోసం, వంచన, అత్యాచారం మొదలైనవన్నీ చెడు కార్యాలని మీతో అఒంగికరిపజెయ ప్రయత్నిస్తున్నాననుకోండి. 
                          పై విషయాల్ని చేదుగా నిరూపించటానికి   నేను కూడా చూపితే, అపరాధి కూడా పై రకంగానే వాటిని ఖండిస్తూ పోతాడు. 

(9) ప్రతి వ్యక్తి న్యాయం కోరుతాడు: 
                              ప్రతి వ్యక్తి న్యాయం కోరుతాడు. ఒకవేళ అతను ఇతరులకు న్యాయం కలగాలనే కోరిక కలిగి లేనప్పటికీ, తనకు మాత్రం తప్పకుండా న్యాయం జరగాలనే అభిలాష కలిగి ఉంటాడు. కొందరు ధనబలం, అంగబలం, అధికార బలం ఉన్మాదంలో, ఇతరులకు హానిని, కష్టాల్ని కలిగిస్తారు. అయితే ఇలాంటి వ్యక్తులకే ఎప్పుడైనా హానిగాని, కష్టం గాని కలిగితే, వారు దీన్ని తీవ్రంగా నిరసిస్తారు. బలశాక్తుల్ని, పలుకుబడిని, ఆరాధించేవారు ఇతరుల బాదల్ని దు:ఖాలను గుర్తించరు. అంటే తమకు లభించిన ఈ బలం, ఈ పలుకుబడి ఇతరులను అణచటానికి, ఇతరుల పట్ల అన్యాయంగా వ్యవహరించటానికి పురిగోల్పటమే కాదు. ఇతరుల అన్యాయాల నుండి, దౌర్జన్యాల నుండి తమకు కాపాడుతున్నదని వారు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే వారు బలం, పలుకుబడి అంటే పడిచస్తారు, దాన్నే వారు ఆరాధిస్తుంటారు. 

(10) దేవుడు అందరినీ మించిన బలవంతుడు, శక్తిశాలి: 
                                 నేనొక ముస్లింగా, అపరాధి అయిన ఒక వ్యక్తిని దేవుని అస్తిత్వం గురించి ఒప్పించగలను. 
                                 ప్రపంచంలోని ఎంతటి శక్తిశాలి, ప్రభావవంతుడు, పలుకుబడి కలిగిన అపరాధి అయినా, దైవం అతనికన్నా అత్యదిక శక్తిమంతుడు, ప్రభావవంతుడే కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసేవాడే కూడాను. దివ్య ఖుర్ఆన్ ఇలా వచ్చింది.:
                        అల్లాహ్ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు. 
(అన్-నిసా : 176)
          
(11) దేవుడు నన్నెందుకు శిక్షించాడు? 
                               బుద్ధిజ్ఞ్యానులు, శాస్త్ర విజ్ఞ్యానంపై విశ్వాసమున్న ఒక దోషి, ఖుర్ఆన్ లో వైజ్ఞానిక వాస్తవికతల్ని చూసి దేవుని ఉనికి వాస్తవమని అన్గాకరిస్తాడు. అలా దైవ ఉనికిని విశ్వసించిన అపరాధి, అంత శక్తిశాలి, బలాడ్యుడు అయిన దైవం, నేను నేరాలు చేస్తూ పోయిన కూడా, న్యాయశీలి అయినప్పటికీ ఆయిన నన్నెందుకు శిక్షించటం లేదు? అని తర్కించే అవకాశముంది. ప్రశ్నించే అవకాశముంది. 

(12) అన్యాయంగా ప్రవర్తిన్చేవారిని శిక్షించాల్సిందే: 
                                తనపై జరిగిన అన్యాయానికి, దౌర్జన్యానికి, వారి ఆర్ధిక, సామాజిక స్ధితిని ప్రక్కకు పెట్టి, నేరస్తునికి తగిన శిక్ష పడాలని అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తి కోరుతాడు. దోపిడీదారునికి, అత్యాచార నేరస్తునికి గుణపాఠం గరిపే శిక్ష పడాలని ప్రతి సామాన్య వ్యక్తి కోరుతాడు. అపరాధులేంతో ముందికి శిక్షలు ఉన్నాయి, అయినప్పటికీ మరెంతోమంది అపరాధులు శిక్ష నుండి తప్పించుకొగలుగుతున్నారు. వీరు భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉంటారు. సుఖసౌఖ్యాలతొ, నిశ్చింతగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులపట్ల, వీరికన్నా శక్తిమంతుడు, పలుకుబడి కలిగిన ఎవరైనా అన్యాయంగా వ్యవహరించాడనుకోండి, ఈ అత్యాచారికి, ఈ నేరస్తునికి తగిన శిక్ష లభించాలని వీరు కూడా అభిలాషిస్తారు. 

(13) ఈ జీవితం పరీక్షా సమయం : 
                           మనకు లభించిన ఈ జీవితం, పరలోకం కోసం పరీక్షా సమయం. దివ్య ఖుర్ఆన్ లో ఇలా హెచ్చరించటం జరిగింది: 
                               ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వ శక్తి మంతుడు, క్షమాశీలుడు.  
(సూర  అల్-ముల్క్ 2 వ వాక్యం)  

(14) తీర్పుదినాన పరిపూర్ణ న్యాయం చేయబడుతుంది : 
                        దివ్య ఖుర్ఆన్ లో ఇలా చెప్పటం జరిగింది :
                         "... ప్రతి ప్రాణి చావును చవిచూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడు తుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టడతాడో! వాస్తవానికి, వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే!"    
  (సూర  ఆలె-'ఇమ్రాన్ 185 వ వాక్యం)
                          మానవునిపట్ల చివరి మరియు పరిపూర్ణమైన న్యాయం తీర్పుదినం రోజున చేయబడుతుంది. మరనించిన తరువాత ప్రతి వ్యక్తిని, తీర్పుదినం రోజు, ఇతర సర్వమానవులతో సహా, సజీవంగా లేపటం జరుగుతుంది. ఒక వ్యక్తీ తన కర్మ, తన నేర శిక్షలోని కొంత భాగాన్ని ఈ లోకంలోనే అనిభావించే అవకాశముంది. కాని శిక్షా బహుమానాల పరిపూర్ణమైన ప్రతిఫలం పరలోకంలో మాత్రమె ఇవ్వబడుతుంది. మహా మహిమాన్వితుడైన దైవం, ఒక దోపిడిదారునికి, ఒక అత్యాచార నేరస్తునికి ఈ భూమిలో శిక్షించి ఉండకపోవచ్చు. కాని పరలోకంలో, తీర్పురోజున, మనిషియొక్క ఒక్కొక్క చర్యకు, ఒక్కొక్క నేరానికి, సంజాయిషీ ఇచ్చుకొవల్సి ఉంటుంది. మరియు మనిషి పరలోకంలో, మరణానంతర జీవితంలో తన ఒక్కొక్క నేరానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు. 

(15) మానవ నిర్మిత చట్టాలు హిట్లర్న్ ను ఏమేరకు శిక్షించగలవు?
                                రెండోవ ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ దాదాపు అరవై లక్షల మంది యొదుల్ని సజీవంగా కాల్చి చంపించాడని చెప్పబడుతుంది. ఒకవేళ పోలీసులు అతన్ని పట్టుకున్నా, చట్ట నియమాల్ని అనుసరించి (మానవ నిర్మిత చట్టాల ప్రకారం) న్యాయస్ధానం యక్కువకు ఎక్కువ అతనికెంత శిక్ష విధించగలుగుతుంద? మహాఅయితే అతన్ని కూడా ఏదో ఒక గ్యాస్ చాంబర్కు పంపి, హతమార్చగలిగెవారు. కాని ఈ శిక్ష అయితే కేవలం ఒక యూదున్ని, గ్యాస్ ఛాంబర్ లో చంపిన దానికి సమానమైన శిక్షగా మాత్రమె పరిగణింపబడేది. మిగిలిన 59 లక్షల 99 వేల 9 వందల 9 మందిని హతమార్చిన శిక్ష ఎలా విధించవీలయ్యెది? క్రియారుపంలో, అతన్ని కేవలం ఒకేసారి మరణ శిక్ష విధించే అవకాశముండేది. 


(16) దైవం, 60 లక్షల కన్నా ఎక్కువసార్లు హిట్లర్ ను నరకాగ్నిలొ కాల్పించవచ్చు :
                                 దివ్య ఖుర్ఆన్ ఇలా వచ్చింది: 
                                  నిశ్చయంగా, ఎవరు మా సూచన లను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారి వారి చర్మాలు కాలిపోయి నపుడల్లా వాటికి బదులుగా వారు బాధను బాగా రుచి చూడటానికి వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్ సర్వ శక్తిమంతుడు మహా వివేచనాపరుడు.  

(సూర  అన్-నిసా 56 వ వాక్యం) 
                             అంటే దైవం తలుచుకుంటే హిట్లర్ ను అరవై లక్షల లేక అంతకన్నా ఎక్కువసార్లు నరకాగ్నిలో కాల్పించవచ్చు. 

(17) పరలోక భావన లేని మానవీయ విలువలు, మంచీ చెడులను ఊహించలేము :
                                  ఒక మనిషిని పరలోక భావన మరియు మరణాంనంతరం ఒక జీవితం ఉందనే విశ్వాసం పట్ల అతన్ని అంగీకరింపజేయకుండా, మానవీయ ఒప్పించే అవకాశమే లేదు. ప్రత్యేకించి శక్తిశాలులు, అధికార మదాంధంలో పడి, అన్యాయానికి ఒడిగడుతున్న వారి విషయంలో ఇది మరీ అసంభవం. 
 16. ముస్లింలు వివిధ వర్గాల్లో, శాఖల్లో ఎందుకు విభజింపబడి ఉన్నారు ?
                      ప్రశ్న: ముస్లిం లందరూ ఒకే ఖుర్ఆన్ ను విశ్వసిస్తారు, దాని ప్రకారమే నడుచుకుంటారు కదా! అటువంటి సమయంలో ముస్లింలలో ఇన్ని వర్గాలు, శాఖలు ఎలా ఏర్పడ్డాయి? 
                       జవాబు: ముస్లింలo తా సంఘటితంగా ఉండాలి 
                       నేను ముస్లింలు పరస్పరం విభజింపబడి ఉన్నారనేది వాస్తవమే. ఇది ఇస్లామీయ ఆదేశాలకు పూర్తిగా విరుద్ధమనేది కూడా నిజమే. ఇస్లాం తన అనుయాయుల్లో ఐక్యతను కోరుతుంది. 
                        దివ్య ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది : 
                       మీరందరూ కలసి అల్లాహ్ త్రాడు (ఖుర్ఆన్)ను గట్టిగా పట్టుకోండి. మరియు విభేదాలలో పడకండి.  
  (సూర  ఆలె-'ఇమ్రాన్ 103 వ వాక్యం)   
                       పై ఆయత్ లో అల్లాహ్ త్రాడు అనే పదాన్ని ఉపయోగించటం జరిగింది. ఈ త్రాడు అనేది అల్లాహ్ అవతరింపజేసిన పవిత్ర గ్రంధం ఖుర్ఆన్. అంటే ముస్లింలందరూ కలిసి కట్టుగా, ఇకమత్యంగా ఈ ఖుర్ఆన్ ఆశ్రయించిన, దీన్నే అనుసరించాలనేది దీని అర్ధం. పై ఆయత్ లో రెండు విషయాలు సృష్టంగా పేర్కొనబడ్డాయి. ఒకటి అందరూ కలిసి అల్లాహ్ త్రాడును (ఖుర్ఆన్) గట్టిగా పట్టుకోవాలి. రెండోవ అంశం విభేదాల్లో పడకండి. వర్గాల్లో, ముక్కల్లో పడిపోకండి. 
ఖుర్ఆన్ ఇలా వచ్చింది: 
                                 ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశ హరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే – మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే – ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పధ్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమ మైనది.  
(సూర  అన్-నిసా' 59 వ వాక్యం) 
                              ముస్లింలందరు దివ్య  ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (స)  హదీసు (ప్రవచనాల) ను ఆచరించాలి.  వీటిని మాత్రమే ప్రామాణికమైనవిగా , ఏదైనా విభేదం వస్తే వీటినే అంతిమ పరిష్కారంగా ఎన్నుకోవాలి. మరియు మరియు పరస్పరం విభేదాల్లో పడకూడదు. 
          
2.  ఇస్లాంలో గ్రూపులుగా, ముఠాలుగా ఏర్పడటం నిషేధం:
                      దివ్య ఖుర్ఆన్ లో ఇలా చెప్పటం జరిగింది:
                      ఎవరైతే తమ ధర్మంలో విభేదాలు కల్పించుకొని, వేర్వేరు తెగలుగా చీలి పోయారో, వారితో నీకు ఎలాంటి సంబంధం లేదు. నిశ్చయంగా, వారి వ్యవహారం అల్లాహ్ అధీనంలో ఉంది. తరువాత ఆయనే వారు చేస్తూవున్న కర్మలను గురించి వారికి తెలుపుతాడు.   
        (సూర  అల్-అన్'ఆమ్ 159 వ వాక్యం) 
                    దివ్య ఖుర్ఆన్ లోని పై ఆయత్ లో, ధర్మాన్ని విభేదించి వారితో, ముఠాలుగా చీల్చేవారితో దూరంగా ఉండాలని సృష్టంగా ఆదేశించటం జరిగింది. 
                    కాని నేటి కాలంలో ఒక ముస్లిం తో "నీవెవరని ?" అని అడిగితే, సామాన్యంగా అతను నేను ముస్లింనని సమాధానమివ్వకుండా నేను సున్నీనని, షియానని, లేక హనషిఅనో, షాఫియి, మాలికి, హంబలీననో సమాధానమిస్తారు. ఇంకొందరు తాము దేవ్-బందీలనీ లేక బరేల్వేలని కూడా సమాదానమిస్తుంటారు.

3. మన దైవప్రవక్త (హజ్రత్ ముహమ్మద్ - స) కేవలం ముస్లిం మాత్రమే: 
                            ఇలా వర్గాల్లో విభజింపబడిన ముస్లింలతో ఖుద్దుగా మన ప్రవక్త (స) ఏ వర్గానికి చెందివుండేవారు? అంటే ఆయన హనషియా, శాఫయీయా? లేక హంబలీ మాలకినా? అని అడిగితే, అదేమ కాదు ఆయన కేవలం ముస్లిం మాత్రమె అని సమాధానమిస్తారు. ఆయనకు పూర్వం దైవం పంపిన అందరూ ప్రవక్తల్లాగే ఆయన కూడా ఒక ముస్లిం మరియు దైవప్రవక్త అని సమాధానమిస్తారు. 
                            దివ్య ఖుర్ఆన్ లోని సూర అలీఇమ్రాన్లోని 52వ ఆయత్ లో మహనీయ ఏసుక్రీస్తు (అలై) ను "ముస్లిం" అని పేర్కొనటం జరిగింది. ఇదేవిధంగా ఇదే సూరాలోని 67వ ఆయత్ లో హజ్రత్ ఇబ్రాహీం (అలై) గురించి, ఆయన యూదుడు కాడని, క్రైస్తవుడూ కాడని కేవలం ముస్లిం అని తెలపటం జరిగింది. 

4. తమను ముస్లింగా చెప్పుకొండని ఖుర్ఆన్ మనల్ని ఆదేశించింది.
                                  (అ) ఎవరైనా ఓ వ్యక్తి ఓ ముస్లింను "నీవు ఎవరు?" అని ప్రశ్నించినప్పుడు, అతనికి జవాబుగా నేను ముస్లింనని పలకాలి, హనఫీ లేక షాఫయి అని కాదు. 
                            దివ్య ఖుర్ఆన్ లో ఇలా చెప్పటం జరిగింది :
                               "అల్లాహ్ వైపునకు పిలిచి, మంచి పనులు చేసి నేను ముస్లింను అని ప్రకటించే వ్యక్తి మాటకంటే మంచి మాట మరెవరిది కాగలదు."
                             దివ్య ఖుర్ఆన్ ఏమంటుందంటే "నేను అల్లాహ్ ముందు తలను వంచే వారిలోని వాణ్ణి అంటే  ముస్లింను అని మీరు చెప్పేయండి."
                             (ఇ) దైవప్రవక్త (స) ముస్లిమేతర రాజులకు ఇస్లాం సందేశాన్నిస్తూ లేఖల వ్రాయించి నప్పుడు, అందులో సూర అలి ఇమ్రాన్ 64వ ఆయత్ ను ఉల్లేఖించేవారు. దాని అనువాదం ఇలా ఉంది. 
                              ప్రవక్తా! ఇలా అను: ''ఓ గ్రంథప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు.'' వారు (సమ్మతించక) తిరిగి పోతే: ''మేము నిశ్చయంగా అల్లాహ్‌కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి.'' అని పలుకు.
  (సూర  ఆలె-'ఇమ్రాన్ 64 వ వాక్యం)

5. ఇస్లాంకు చెందిన అందరు విద్వాన్సుల్ని, ధర్మశాస్త్రవేత్తల్ని గురవించండి : 
                      ప్రఖ్యాతిగాంచిన నలుగురు ధర్మశాస్త్రవేత్తలైన ఇమాం అబూ హనీఫా, ఇమాం షాఫి, ఇమాం మాలిక్, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ తో సహా మిగిలిన ధర్మశాస్త్ర వేత్తలందరినీ మనం గౌరవించాలి, ఆదరించాలి. ఇంకా వారిపట్ల సద్భావన కలిగి ఉండాలి. వీరంతా కూడా ఇస్లామీయ ధర్మానికి చెందినా మహా విద్వాంసులు. వారు చేసిన ధార్మిక సేవలకు, వారు పడ్డ ప్రయాసలకు దైవం వారికి ఇతోధిక పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇమాం అబూ హనీఫా లేక ఇమాం షాఫయి మొదలగు వారి ఆలోచనా సరళిని అనుసరిస్తున్న వారిని ఎవరు కూడా ఆక్షేపించటం ఎంతమాత్రం సమంజసం కాదు. అయితే ఎవరైనా నీవెవరు? అని అడిగినప్పుడు మాత్రం నేను ముస్లిం నని మాత్రమే సమాదానమివ్వాలి. 
                       కొందరు వ్యక్తులు విభేదాలు విషయాన్ని ప్రస్తావిస్తూ హదీసు గ్రందమైన సునన్ అబూ దావూద్ లోని హదీస్ నెం. 4579ను తమ వాదనకు ప్రమానపూర్వకంగా చెబుతారు. అందులో తన అనుచరగణం 73 వర్గాల్లో విభాజించబడుతుందని దైవప్రవక్త (స) సెలవిచ్చారు. ఈ హదీస్ లో అనుచరగణం 73 వర్గాల్లో విభాజించబడుతుందని చెప్పబడినప్పటికీ, ముస్లింలు తమను తాము 73 వర్గాల్లో విభాజించకోవాలని మాత్రం చెప్పబడలేదే! మనం వర్గాల్లో, శాఖాల్లో విభాజింపబదకూడదని దివ్య ఖుర్ఆన్ మనల్ని ఆదేశిస్తున్నది. దివ్య ఖుర్ఆన్ ను, ప్రామాణిక హదీసులను ఎవరైతే కల్లకద్దుకుంటారో, వాటిని తు.చ. తప్పక పాటిస్తారో, వాటిని అనుసరిస్తూ, వర్గ విభజనలో పడకుండా జాగ్రత్తవహిస్తారో, వారే సన్మార్గంపై ఉన్నారు. 
                            హదీసు గ్రందమైన తిర్మిజీలోని హదీసు నెం. 171ను అనుసరించి తన అనుచర గణం (73) వివిధ వర్గాల్లో విభాజించబడుతుందని, అందులోని ఒక్క వర్గం తప్ప మగిలిన ప్రతివర్గం నరకానికి వెళ్తుందని దైవప్రవక్త (స) తెలిపారు. 
                            దానిపై ఆయన అనుచరులు (రజి) "ముక్తిని పొందే వర్గం లేక సమూహం ఏది?" అంటూ ప్రశ్నించారు. 
                          "నన్ను, మరియు నా ప్రత్యక్ష అనుచరులు (సహాబా-రజి) ను అనుసరించినవారు" అంటూ దైవప్రవక్త (స) ప్రత్యుత్తరమిచ్చారు. 
                          దివ్య ఖుర్ఆన్ లోని అనేక ఆయత్ లోని అల్లాహ్ ను మరియు దైవప్రవక్త (స) ఆజ్ఞల్ని పాటించమని ముస్లింలను ఆదేశించటం జరిగింది. ఒక నిజమైన ముస్లిం, దివ్య ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసులను మాత్రమే అనుసరించాలి. ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసులను అనుసరించి ఉన్న ఏ ఇమాం లేక విద్వాంసుని ఆలోచనా సరలితోనైనా ఒక ముస్లిం ఏకీభవించవచ్చు, ఏకీభవించాలి కూడాను. కాని ఆ ఆలోచనాసరళి, ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసులను అనుసరించి లేదని తెలిసినప్పుడు దాన్ని సమర్పించిన తత్వవేత్త లేక విద్వాంసుడు ఎంత గోప్పవాడైనాసరే- అది విలువలేనిది. 
                         ముస్లిం లందరూ దివ్య ఖుర్ఆన్ ను, ప్రామాణిక హదీసుల వెలుగులో అర్ధం చేసుకుంటూ చదివితే - దైవచిత్తమయితే - ఈ వర్గ భేదాలన్నీ ఈ వ్యతిరేకతలన్నీ  అంతమయిపోతాయి. ముస్లిం లంతా ఒకే ఐక్య అనుచర గణంగా (ఉమ్మత్ గా ) రూపొందుతారు. 



  

                  
 
             


 

5 comments:

  1. jazakallah ahmed bhai.....Allah aap ko Accha sahed de.....aameen

    ReplyDelete
  2. బైబిలు లోని దేవుడు, ఖురాన్ లోని దేవుడు ఒకరు కాదు!! వారి వ్యక్తిత్వాలు వేరు, లక్షణాలు వేరు, పేరులు వేరు. దయచేసి వీరిద్దరినీ కనీసం పోల్చనుకూడా వద్దు.
    Does Christianity condemn Pork? Do you think that can make the human being "Un Holy"? Sorry bro!! God talks about the "Inner holiness i.e., our mind, soul and spirit. Not physical holiness.
    “Do not call anything impure that God has made clean.” Acts 7:15

    By the way, God created ONE EVE for ONE ADAM. He knows that ADAM can do justification to atleast 5 women. Then why didn't He create 5 Eves? Please think..

    ReplyDelete
  3. ఖురాన్ లో ఉన్న చాలా కొన్ని మంచి వాక్యాలను ఉదహరించి ప్రయత్నం చేశారు. కానీ చాలా వాక్యాలు అవిశ్వాసులను చంపమని, దోపిడీ చేయమని,ఉంపుడుగతెలుగా ఉంచుకోమని, బానిసలుగా చేసుకోమని చెప్పాయి. వాటి గురించి చెప్పరు ఎందుకు? ప్రవక్త ఎన్నడు శాంతి మాటలు పలకలేదు. అల్లా కూడా శాంతి వచనాలు చెప్పలేదు. మరి శాంతి మతం అంటే ఎలా నమ్మేది? భారతదేశంలో అందరూ ఇస్లాం రాజులు భయంకరమైన నరమేధాన్ని సృష్టించి మత మార్పిడి చేశారు. ప్రవక్త ఆచరించిన విధానాలనే ఇప్పటికీ ఇస్లాం విస్తరణకు ఆచరిస్తున్నారు అనుకోవడం లో సందేహం లేదు అనేది నా అభిప్రాయం.
    ఇస్లాం గురించి నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఖురాన్ చదివాక అది కాస్తా పోయింది. దీనికి మీరు ఏం చెప్తారు.

    ReplyDelete
    Replies
    1. Meku quran ardam cheskovadam radu ani naku ardam ayndi meru sariga ardam cheskoni tharvatha adi correct ani chepandi appati varaku meku wrong ani cheppe right ledu

      Delete
  4. దోపిడి తప్పని మీరు చెప్పడం చాలా హాస్యాస్పదం. ఖురాన్ లో దోపిడీ సొమ్ము స్వచ్ఛ మని న్యాయ సమ్మతం అని అల్లా చెప్పాడు. ఇంకా ఇంకా ఏదో పిడి సొమ్మును కానీ మా అని చెప్తూ వాటిని ఎలా పంచుకోవాలో స్పష్టంగా ఖురాన్ లో ఉంది అలాగే హదీసుల లోనూ దొంగ సొమ్ము ప్రవక్త పంపకాలు చేసినట్లు స్పష్టంగా ఉంది. దోపిడీ దౌర్జన్యం అత్యాచారాలు చేయమని ఖురాన్ చెబుతుంటే మీరేమో దోపిడీ తప్పని ఖురాన్ చెబుతుందని మాకు కథలు చెబుతున్నారు.

    ReplyDelete