------------------------------------------------------------------------------------------
ప్రతి మనిషి తప్పకుండా తన నిజ సృష్టికర్తను గురించి అన్వేషించాలి
------------------------------------------------------------------------------------------
ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తాడు. స్వీయపరిశీలన చేయకుండా గుడ్డిగా ఏ వస్తువూ తీసుకోడు.
ఉదాహరణకు:- బట్టల షాపుకు, లేదా చెప్పుల షాపుకు వెళ్ళి,
చూడకుండా, పరిశీలించకుండా ఏదైనా వస్తువును కొంటారా... ?????
ఖచ్చితంగా అలా చేయరు.
ఎందుకంటే అలా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది.
అందుకే ఒక ఒక కేజీ కూరగాయలు తీసుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటారు ....
కాని ఒక్క సృష్టికర్త విషయంలో మాత్రం స్వీయపరిశీలన చేయకుండా మన పూర్వీకుల పై, పండితులపై, పాస్తర్లపై, మౌల్వీలపై, గుడ్డిగా ఆధారపడటం వల్ల వారు మనల్ని సత్యానికి దూరంగా తీసుకొని వెళ్తున్నారు.అందువల్ల మనం నిజ దేవుడు ఎవరు అన్న సత్యాన్ని తెలుసుకోలేక అసత్య దైవాలను ఆరాధిస్తూ ... ఇదే మన సంస్కృతి అన్న భ్రమ లో ఉన్నాము.
ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలించే మనము,,,
ఎవరైతే మనల్ని పుట్టించాడో,,
ఎవరైతే మనకు ఈ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాడో,
ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మాత్రం ఈ పరిశీలనా జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు.
ప్రాపంచిక సరదాలకోసం ఎంతో సమయాన్ని వృధా చేసే మనము ఆ సృష్టికర్తను గురించి అన్వేషించడానికి మాత్రం సమయాన్ని తీయడానికి ప్రయత్నించడం లేదు.
సోదరులార! అందుకే ఆ సృష్టికర్త గురించి ఆలోచించాలి, పరిశీలించాలి. ఆ సృష్టికర్తను అన్వేషించడానికి సమయాన్ని కేటాయించాలి.
నిజమైన దేవుడు ఎవరు? అని ఈ ప్రపంచంలో ఉన్న సగటు వ్యక్తిని ప్రశ్నించండి., విభిన్న సమాధానాలు వస్త్ఘాయి.
ఉదాహరణకు:-- కొందరు దేవుడు ఒక్కడే అని, మరికొందరు ముగ్గురు అని, ఇంకొందరు ముక్కోటి అని ఇలా అనేక రకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు. దేవుడు మానవుడిగా అవతరిచాడు అని కొందరు అంటే, మనవున్నే దేవునిగా మార్చినవారు మరికొందరు సృష్టికర్త వేరు, సృష్టి వేరు అని ద్వైతవాదులు అంటే సృష్టి మరియు సృష్టికర్త రెండూ ఒక్కటే అనేవారు అద్వైతవాదులు ఇవన్ని విని అసలు దేవుడే లేడు అని వాదించే నాస్తికులు ఉన్నారు.
నిజమైన దేవుడు ఎవరు? అన్న ప్రశ్న ఎంతో కన్ఫ్యూషన్ కు గురైంది అనేది వాస్తవం. ఈ కన్ఫ్యూషన్ దూరం చేయవలసిన భాద్యత ఎవరిది? ఆలోచించండి !!!!!!!!
------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------
మానవునికి ఋజుమార్గాన్ని చూపించవలసిన బాధ్యత ఎవరిది?
------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------
ఒక చిన్న ఎలక్ర్టానిక్ పరికరాన్ని తాయారు చేసిన శాస్త్రవేత్త కూడా దాన్ని ఎలా ఉపయోగిస్తే లాభం, ఎలా ఉపయోగిస్తే నష్టం అన్న విషయాలను తెలియజేయడానికి ఒక విషయ సూచిక (instruction manual ) ను తప్పకుండా ఇస్తాడు. మరి ఇంత అద్భుతమైన విశ్వాన్ని, అందులో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మానవునికి ఎటువంటి మార్గదర్శకత్వాన్ని చూపించకుండా ఉంటాడా. ఒకవేళ చూపించకుండా ఉంటే తీర్పుదినం నాడు మనిషి దేవుడితో తప్పకుండా ఇలా వాదిస్తాడు !!!!!
"ఓ దేవుడా! నీవు నాకు ఎటువంటి మార్గదర్శకత్వాన్ని చూపించలేదు,,,, అందుకే నేను నా ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడిపాను, నా ఇష్టం వచ్చినదాన్ని దేవునిగా చేసుకుని ఆరాధించాను, నీవు నాకు సత్యమేదో అసత్యమేదో,, ధర్మమేదో అధర్మమేదో తెలియజేసి ఉంటె నేను సన్మార్గంలో నడిచి ఉండేవాణ్ణి'''''' అని అంటాడు
అందుకే సర్వజ్ఞుడైన సృష్టికర్త ప్రతి యుగంలో, ప్రతి జాతిలో మానవునికి ఋజుమార్గం చూపడానికి ఒక ప్రవక్తను (సందేశాహరుణ్ని) ప్రభవింపజేస్తాడు ఈ ఖుర్ ఆన్ వాక్యాన్ని గమనించండి:::
(و لي كلي عمتن رسول) "వలికుల్లి ఉమ్మతిం రసూల్ "(10:47)
మేము ప్రతి జాతిలోను ఒక ప్రవక్తను పంపాము
ఖుర్ ఆన్ హదీసు గ్రంథం ప్రకారం ఆది నుండి నేటి వరకు దేవుడు 1,24000 మంది ప్రవక్తలను ప్రభవింపజేసాడు.
కలియుగంలో చిట్టచివరగా పంపించబడిన వారె మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివ సల్లం). సృష్టికర్త సర్వమానవాలికి మార్గదర్శకత్వం కోసం అంతిమంగా అవతరింపజేసిన గ్రంథమే దివ్య ఖుర్ ఆన్
------------------------------------------------------------------------------------------
త్వరలో
వీలైనంత త్వరలో ఈ ఆర్టికల్ మీ ముందుకు తెస్తాము .... ఇన్ షా అల్లాహ్
మా ఈ ప్రయత్నం లో షైతాన్ ఆటంకాల నుండి రక్షణ కోసం అల్లాహ్ ను ప్రార్దించండి
మా ఈ చిరు ప్రయత్నం లో సహకరించాలనుకుంటే ఈ క్రింది అడ్డ్రస్ కు సంప్రదిం చండి
e - మెయిల్ : impsayeed@gmail.com
పేస్ బుక్ పేజ్ : https://www.facebook.com/sayeedimp?ref=hl
ఫోన్ నంబర్ : 9030888596
మనిషి తన నిజ సృష్టికర్తను గురించి ఎందుకు అన్వేషించాలి... ???

No comments:
Post a Comment