Wednesday, 16 April 2014

''గుజరాత్‌ మారణకాండను ఎలా మరచిపోగలం''
---------------------------------------------
సామాన్య హిందువులను - అధికారం కోసం కొన్ని రాజకీయ దుష్టశక్తులు   - అమాయక స్త్రీలపై  అత్యాచారాలు జరిపి హతమార్చే రాక్షసులనుగా మార్చాయి. వాళ్లు వృద్ధులూ, మహిళలతో సహా ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని సైతం శూలాలతో, కత్తులతో పొడిచి చంపారు, సజీవ దహనం చేశారు. విచ్చలవిడిగా గృహదహనాలకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. గర్బవతి కడుపు ను కోసి కడుపులో నుండి శిశువును తీసి శూలంతో గుచ్చి చంపారు

ఆ దారుణకాండ జరిగిన పుష్కరానికి ఇప్పుడు - 2014 లో - ఈ ఎన్నికల సమయంలో - గుజరాత్‌ నమూనాను యావద్భారతదేశానికే ఆదర్శప్రాయమైనదిగా ఊదరగొడ్తుండం దిగ్భ్రాంతిని, ఆవేదనను ఆక్రోశాన్ని కలిగిస్తోంది.

అహ్మదాబాద్‌ వెళ్తున్న సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లో ఒక బోగీపై గోధ్రా వద్ద దాడి చేసి తగులబెట్టడం, 12 మంది పసిపిల్లలు, 26 మంది మహిళలతో సహా 58 మందిని సజీవ దహనం చేయడం క్షమించడానికి వీల్లేనంత రాక్షసత్వం. ఆ అమానుష అకృత్యానికి పాల్పడిన దుర్మార్గులని తక్షణమే విచారించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందే. దానిని  ప్రతి ముస్లిం సమర్దిస్తాడు

కానీ ఆ నెపంతో-  ఆ దారుణంతో ఏమాత్రం సంబంధంలేని స్త్రీలపై  అత్యాచారాలు జరుపడం , పసిపిల్లలతో సహా అనేకమంది స్త్రీలనూ పురుషులనూ హతమార్చడం, విచ్చలవిడిగా విధ్వంసానికి పాల్పడడం అమానుషం. సభ్యసమాజం తలదించుకునేట్టు చేసిన ఉన్మాదం.
ఏమతం, ఏ ధర్మశాస్త్రం ఈ పైశాచికత్వాన్ని సమర్థిస్తుంది?

-----------------------------------------------------------
నాసిర్‌ ఖాన్‌ రహీంఖాన్‌ పఠాన్‌, ప్రిన్సిపాల్‌, సన్‌ఫ్లవర్‌ స్కూలు చెప్పిన సాక్ష్యం:
------------------------------------------------------------

' నేను 9, 10 తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు గణిత, బోధిస్తాను. మా స్కూల్లో హిందూ ముస్లిం విద్యార్థులు ఒకే బెంచీలో కూర్చుని చదువుకుంటారు. ఫిబ్రవరి 28న (2002) గుజరాత్‌ బంద్‌ ప్రకటించిన రోజు ఐదు పదివేలమందితో కూడిన చాలా పెద్ద గుంపు ఖాకీ రంగు నిక్కర్లు, కాషాయ రంగు బనియన్లు, తలకు నల్ల పట్టీలు కట్టుకుని వచ్చి దాడి జరిపారు. వాళ్ల దగ్గర శూలాలు, కత్తులు, యాసిడ్‌ బాంబులు, పెట్రోలు వున్నాయి. ... ... ...

మహ్రుక్‌ బానో కూతురు ఖైరున్నీసా పై జరిగిన అత్యాచారానికి ప్రత్యక్ష సాక్షిని నేను. పశువుల గుంపు 11 మంది ఆమెపై అత్యాచారం చేశారు.... .. తరువాత ఆ మూక, ఆ కుటుంబం మొత్తాన్ని ఒకరి తరువాత ఒకర్ని సజీవంగా దహనం చేశారు. ఇంటి యజమానురాలు ఖైరున్నీసా తల్లిని ముక్కలు ముక్కలుగా నరికారు  ...

గంగోత్రి, గోపి పార్క్‌ దగ్గర ఎస్‌టి వర్క్‌షాప్‌ వెనుక ఉన్న తిస్రా కుఆన్‌లో సుమారు 80 మందిని సజీవంగా దహనం చేసి బావిలోకి విసిరేశారు. తర్కాష్‌ బీబీ అబ్దుల్‌ ఘనీ అనే 70 ఏళ్ల ముసలామెను కూడా వాళ్లు సజీవ దహనం చేశారు. '' ముసల్మానోంకో జిందా జలాదో'' అన్నది వాళ్ల సందేశం. ...

గుండెల్ని పిండివేసే  ఇలాంటి అనేక దారుణాలను కమ్యూనిజం కంబాట్‌ పత్రిక సంపాదకులు తీస్తా సెతల్వాద్‌, జావెద్‌ ఆనంద్‌లు ఈ ప్రత్యేక సంచిక ద్వారా వెలుగులోకి తెచ్చారు.

గుజరాత్‌ 2002, జాతి హత్యాకాండ

గుజరాత్‌లో జరిగిన దారుణ మారణకాండ సంఘటనలు ఇప్పటికి మా గుండెల్ని పిండి చేస్తున్నాయి
.
భారతదేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమూ, చట్టబద్దపాలనా వుండాలనీ, మానవ విలువల్ని కాపాడుకోవాలనీ అనుకునే వ్యక్తులకీ సంస్థలకీ దీనిని  చర్చించి విస్తృత స్థాయిలో ప్రజల ముందుకు  తీసుకెళ్లాల్సిందిగా మనస్పూర్తిగా ప్రతి వ్యక్తిని కోరుతున్నాం.

రాష్టం రక్తపు మడుగు లో వుంటే రాజకీయ లబ్ది కోసం చూస్తూ కూచున్న చేత కాని మోడీ కి దేశ ప్రధాని గా ఉండే  అర్హత ఉందా .... ఇటువంటి వానిని దేశ ప్రదాని గా మీరు ఒప్పుకుంటారా ...???

మోడీ కో హారావో - దేశ్ కో బచావో



... ... ...

No comments:

Post a Comment