Thursday, 27 March 2014

పరిమళించిన మానవత్వం

నిన్న 11 సంవత్సరాల పాప డెంగు జ్వరం వల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోయి సీరియస్ గా ఉంది ..
రక్తం కణాల కోసం ఎవరి రక్తం సెట్ అవ్వడం లేదు
దగ్గరలో వారికీ తెలిసిన వారు కుడా ఎవ్వరూ లేరు

ఇటువంటి పరిస్తితిలో FACEBOOK లో అర్జంట్ గా రక్తం కావాలి అని పోస్ట్ పెట్టాము
పెట్టిన గంటలోనే అనూహ్య మైన స్పందన కనిపించిది
60 మందికి పైన రక్తకణాలను ఇవ్వడానికి వచ్చారు...వారిలొ ఎక్కువ మంది యువకులే
దురదుష్టవశత్తు ఎవరికీ సెట్ అవ్వలేదు ....
చివరికి అదే బ్లడ్ బ్యాంకు లో పనిచేసే రవి అనే కుర్రాడు రక్త కణాలను ఇచ్చాడు

ఇంత బిజీ బిజీగా వుండే బాగ్యనగరం లో ఇంతమంది ఎ సంబంధం లేకుండానే కేవలం పేస్ బుక్ లో పోస్ట్ చూసి సహాయం చేయడానికి రావడం నిజంగా హాట్సాఫ్
  
నా మనస్సులో  అనిపించింది
ఈ ప్రపంచంలో మంచితనం ఇంకా మిగిలి ఉంది 

No comments:

Post a Comment